జెమ్ చిత్రం ట్రైలర్ విడుదల
 
యాక్షన్ ప్యాక్డ్ “జెమ్” ట్రైలర్ విడుదల, 17న థియేటర్ లలో సినిమా రిలీజ్
 
 
విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “జెమ్”. ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న “జెమ్” చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా  “జెమ్” సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.
 
“జెమ్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో ట్రైలర్ నిండిపోయింది. హీరో విజయ్ రాజా, హీరోయిన్ రాశీ సింగ్, విలన్ అజయ్ క్యారెక్టర్ ల చుట్టూ మెయిన్ కథంతా ఉన్నట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ నక్షత్రది కీ రోల్ గా కనిపిస్తోంది. విజయ్ రాజా చేసిన ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పంచ్ డైలాగ్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో “జెమ్” సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. విజయ్ రాజా ను మంచి కమర్షియల్ హీరోగా నిలబెట్టే అంశాలన్నీ “జెమ్” లో ఉన్నాయని తెలుస్తోంది.
 
ఈ చిత్రానికి సంగీతం – సునీల్ కశ్యప్, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ, పీఆర్వో జీఎస్కే మీడియా, నిర్మాత – పత్తికొండ కుమారస్వామి, దర్శకత్వం – సుశీల సుబ్రహ్మణ్యం.