జోరుగా హుషారుగా చిత్రం నుంచి పాట విడుద‌ల

Published On: November 14, 2023   |   Posted By:

జోరుగా హుషారుగా చిత్రం నుంచి పాట విడుద‌ల

జోరుగా హుషారుగా చిత్రం నుంచి ర‌ఫ్ఫా ర‌ఫ్ఫా ర‌ఫ్ఫాడిస్తే సాంగ్ విడుద‌ల

బేబి చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల హౄద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాందించుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం జోరుగా హుషారుగా పూజిత పొన్నాడ క‌థానాయిక‌. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ర‌ఫ్ఫా.. ర‌ఫ్ఫా.. ర‌ఫ్ఫాడిస్తే అనే ప‌ల్ల‌వితో కొన‌సాగే ఎన‌ర్జిటిక్ అండ్ ఎమోష‌న‌ల్ సాంగ్‌ను ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. రామ‌జోగయ్య శాస్త్రి ర‌చించిన ఈ పాట‌కు న‌క‌ష్  అజీజ్ ఆల‌పించ‌గా, సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ బాణీల‌ను అందించారు. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ మాస్ట‌ర్ న‌త్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హీరో నాని మాట్లాడుతూ ఇప్ప‌డే సాంగ్, టీజ‌ర్  చూపించారు. సినిమాలో మంచి ఫ‌న్ వైబ్ వుంది. ప్ర‌స్తుతం సిట్యుయేష‌న్‌కు ఈ టైమ్‌లో అంద‌రికి ఇలాంటి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా అవ‌స‌రం. లవ్‌స్టోరీస్‌, ఎంట‌ర్‌టైన్ మెంట్ సినిమాలు చేసే ద‌ర్శ‌కుల మీద నాకు మంచి గౌర‌వం వుంది. ఈ సాంగ్‌ను నేను విడుద‌ల చేయ‌డం హ్య‌పీగా వుంది. సాంగ్ చాలా ప్రామిసింగ్‌గా వుంది. నేను న‌టించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ లోని వై అనే సాంగ్‌లో వున్న వైబ్ ఈ సాంగ్‌లో క‌నిపించింది. విరాజ్ అశ్విన్‌లో మంచి ఎన‌ర్జీ వుంది. అంద‌రికి ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ ను అందించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ నాని చేతుల మీదుగా ఇంత మంచి ఎన‌ర్జీటిక్ ఎమోష‌న‌ల్  సాంగ్ విడుద‌ల కావ‌డం  ఆనందంగా వుంది. అన్నారు. హీరోయిన్ పూజిత పొన్నాడ మాట్లాడుతూ నాని గారి చేతుల మీదుగా ఈ సాంగ్ విడుద‌ల కావ‌డం సంతోషంగా వుంది. అన్నారు. ద‌ర్శ‌కుడు అనుప్ర‌సాద్ మాట్లాడుతూ యూత్‌ఫుల్ అంశాల‌తో పాటు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. ఈ సాంగ్‌లో విరాజ్ అశ్విన్ మాస్ స్టెప్స్ చూడ‌బోతున్నారు. ఇలాంటి మంచి సినిమాల‌కు త‌న స‌పోర్ట్ ఎప్పుడూ వుంటుంద‌ని, ఈ సాంగ్‌లో మంచి ఎమోష‌న్ వుంటుంద‌ని, త‌ప్ప‌కుండా చిత్రం అన్ని వ‌ర్గాల‌ను అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంద‌ని ప్ర‌ముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. ఈ చిత్రం యూత్ తో పాటు అన్ని వ‌ర్గాల‌ను అల‌రించే అంశాలున్నాయ‌ని ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్  తేజ తిరువిధుల తెలిపారు.

విరాజ్ అశ్విన్‌, పూజిత పొన్నాడ‌, సాయికుమార్‌, రోహిణి, మ‌ధునంద‌న్‌, సిరి హ‌నుమంతు, సోనూ ఠాకూర్‌,  బ్రహ్మ‌జీ , చ‌మ్మ‌క్ చంద్ర‌, క్రేజీ క‌న్నా త‌దిత‌రులు న‌టిస్తున్న చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్‌, ఎడిట‌ర్‌: మ‌ర్తండ్‌కెవెంక‌టేష్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: తేజ తిరువి