టాటా అవార్డుల ప్రధానం

తెలంగాణా అమెరికా తెలుగు అసోసియేషన్ ,టాటా సమ్మర్ సందడి2020 పేరుతో నిర్వహించిన చిత్రం భళారే  విచిత్రం,వెభావరి మరియు ఇతర పోటీలలో ఇండియా నుంచి విజేతలుగా నిలిచిన వారికి డైరెక్టర్,జ్యూరీ మెంబర్ డా.ఆనంద్ సారధ్యంలో ఫిల్మ్ నగర్ లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ చాంబర్ లో సామాజిక దూరాన్ని,కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అవార్డ్ లను, క్యాష్ ప్రైజ్ లను జాతీయ ఉత్తమ చిత్రం పెళ్ళి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి,ప్రసన్న కుమార్,డా.వడ్డేపల్లి కృష్ణ,బుల్లెట్ భాస్కర్ ,బాల నటి హాసిని అన్వి,ఈ సీ గోపాల్ అతిధులుగా నిర్వహించారు.

ఉత్తమ షార్ట్ ఫిల్మ్ లు,మ్యూజిక్ వీడియోస్ ,షార్ట్ స్టోరీస్,కవితలు,పద్యాలు,ఆర్ట్,తదితర విభాగాలలో అవార్డ్ లను అందజేయడం జరిగింది.

డా.పైల మలా రెడ్డి ఆశీస్సులతో,టాటా ప్రెసిడెంట్ భరత్ మదాడి అధ్యక్షులుగా,వంశి రెడ్డీ, రమ వనమ,అశోక్  చింతకుంట,శ్రీనివాస్ గూడూరు,డా.హరనాథ్ పొలిచెర్ల, శ్రీనివాస్ మనప్రగడ,వెంకట్ ఎక్క, తదితరులు నిర్వాకులుగా జరిగిన ఈ వర్చువల్ ఈవెంట్ ని అద్భుతంగా విజయవంతం చేసినందుకు,జ్యూరీగా వ్యవహరించిన మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్,వందేమాతరం శ్రీనివాస్,తదితరులకు డా.ఆనంద్  ధన్య వాదాలు తెలియ జేసారు.