టాప్ గేర్ మూవీ రివ్యూ

Published On: December 30, 2022   |   Posted By:

టాప్ గేర్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

ఒక్క హిట్ తన ఖాతాలో పడకపోయినా వరసపెట్టి సినిమాలు చేస్తూ పోతున్నారు ఆది సాయికుమార్ అతని సినిమాలు ఎంత త్వరగా వస్తాయో అంత త్వరాగానూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి దాంతో ఆయన సినిమాలపై జనాలకు ఆసక్తి తగ్గిపోయింది ఏదైనా అదిరిపోయే సినిమా వస్తేనే జనాలు ఆది సినిమా వైపు చూస్తారు అలాంటి సినిమా తన కెరీర్ లో ఎప్పటికైనా పడకపోతుందా అని గేర్ మారుస్తూ జర్నీ కొనసాగిస్తూ ఈ సారి టాప్ గేర్ వేసాను చూడండి .అని మన ముందుకు వచ్చారు నిజంగా టైటిల్ కి తగ్గ స్దాయిలో వర్కవుట్ అయ్యే కథనా లేక ఈ సినిమా కూడా ఆది రెగ్యులర్ రొటీన్ ప్లాఫ్ ల లిస్ట్ లో కలిసిపోయేదా రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

క్యాబ్ డైవర్ అర్జున్ (ఆది సాయికుమార్) ఎప్పటిలాగే డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తూంటే ఓ బేరం తగులుతుంది. అదే అతని జీవితాన్ని సమస్యల్లో పడేస్తుందని ఊహించక సరే అంటాడు కానీ అది సాహసాలకి దారి తీస్తుంది మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ సిద్ధార్థ్ (మైమ్ గోపి) కు సంభందించిన డ్రగ్ బ్యాగ్ మిస్సవటం, అందులో ఇరుక్కుపోవటం జరుగుంది. తన డీల్ పూర్తి చేసుకుని సింగపూర్ పారిపోదామనుకునే సిద్దార్ద్ అర్జున్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి తన పని చేయించుకోవాలనుకుంటాడు అర్జున్ భార్య ఆద్య (రియా సుమన్) కిడ్నాప్ చేసి బెదిరిస్తూంటాడు అక్కడ నుంచి అర్జున్ తన భార్యని కాపాడుకోవటం కోసం ఏం చేసాడు చివరకు ఏమైంది డ్రగ్ ముఠాలో అర్జున్ ఎలా ఇరుక్కున్నాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఒక నైట్ లో జరిగే కథ ఇది ఈ థ్రిల్లర్ లో ట్విస్ట్ లు బాగున్నాయి కానీ ఊహకు అందేస్తాయి. డైరక్టర్ శశికాంత్ వాస్తవానికి గ్రిప్పింగ్ గా సాగే కాన్సప్టుతోనే వచ్చాడు కానీ దాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారు స్క్రీన్ ప్లే కాన్సెప్టులో ఉన్నంత రేసిగా చేసుకునిఉంటే బాగుండేది చాలా చోట్ల లాగ్ లు, టైమ్ వృధా చేసుకుంటూ సాగేవి ఉన్నాయి స్క్రీన్ ప్లే సరిగ్గా ఉండి రైటింగ్ లో మార్పాలు చేసి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడేది అయ్యేది అయితే కథ ఎత్తుగడ బాగుంది తనకు సంబంధం లేని క్రైమ్‌లో అమాయ‌కుడైన హీరో చిక్కుకోవ‌డం అందులోంచి త‌న ధైర్య‌సాహ‌సాలు, తెలివితేట‌ల‌తో బ‌య‌ట‌ప‌డ‌టం అనేది మనని కనెక్ట్ చేసేస్తుంది అదే నమ్మి ఈ రొటీన్ పాయింట్‌కు కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు డైరక్టర్. హీరో పర్శనల్ లైఫ్ , డ్ర‌గ్స్ బ్యాక్‌డ్రాప్ రెండు క‌థ‌ల్ని వేర్వురుగా మొద‌టుపెట్టి వాటిని ఒక్క‌టిగా లింక్ చేసిన విధానం బాగుంది అర్జున్ క్యాబ్‌లోకి డ్ర‌గ్స్ వచ్చాకే క‌థ స్పీడుగా ప‌రుగులు పెడుతుంది డ్రగ్స్ బ్యాగ్ మిస్ కావ‌డం అత‌డిని సిద్ధార్థ్ గ్యాంగ్‌తో పాటు పోలీసులు ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే స‌న్నివేశాల‌ను ఎంగేజింగ్‌గా చూపించటమే కలిసొచ్చింది.

టెక్నికల్ గా

ప్రొడక్షన్ డిజైన్ బాగుంది సినిమాటోగ్రఫీ కూడా నచ్చుతుంది ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది డైలాగ్స్ బాగున్నాయి. కానీ క్లైమాక్స్ ఊహకు అందిపోతుంది ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీస్తామని వేయటం మాత్రం కాస్త హాస్యాస్పదంగానే అనిపిస్తుంది అయితే మనుష్యుల ఎమోషన్స్ ఇతరులు ఎలా ఆడుకుంటారన్నది మాత్రం ఆసక్తిగా అనిపించింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది.

నటీనటుల్లో ఆది సాయికుమార్ కి ఇలాంటి క్యారక్టర్స్ చేయటం కొత్తేమీ కాదు అయితే కథ మాత్రం అతనికి తగ్గదే రొటీన్ గా చేసుకుంటూ పోయాడనిపించింది హీరోయిన్ రియా సుమన్ కు పెద్దగా సీన్స్ లేవు విలన్ గా మైమ్ గోపి బాగా చేసారు.

చూడచ్చా :

థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉన్న వారు ఓ లుక్కేయవచ్చు.

ప్లస్ లు :
నీట్ గా చేసుకుంటూ పోయిన ఆది
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ లు :

స్క్రీన్ ప్లే
సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు
పూర్ క్లైమాక్స్

నటీనటులు :

ఆది సాయికుమార్, రియా సుమన్, మైమ్ గోపి, శత్రు, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ తదితరులు

సాంకేతిక వర్గం :

కథ, మాటలు, దర్శకత్వం : ఎన్.శశికాంత్
కూర్పు : ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
రన్ టైమ్ : 143 మినిట్స్
సంగీతం : హర్షవర్థన్ రామేశ్వర్
నిర్మాత : కె.శ్రీధర్ రెడ్డి
విడుదల తేదీ: డిసెంబర్ 30, 2022