టైగర్ నాగేశ్వరరావు మూవీ థర్డ్ సింగిల్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ టైగర్ నాగేశ్వరరావు థర్డ్ సింగిల్ ఇచ్చేసుకుంటాలే పాట విడుదల

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా వున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఇటివలే విడుదలై ట్రైలర్‌ కు నేషనల్ వైడ్ గా టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు చార్ట్ బస్టర్స్ హిట్స్ గా అలరిస్తున్నాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్ ఇచ్చేసుకుంటాలే పాటని విడుదల చేశారు.

బ్యూటీఫుల్ రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశారు జీవి ప్రకాష్. భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యం.. హీరోయిన్ మనసులోని ప్రేమని చాలా అందంగా ఆవిష్కరించింది. సింధూరి మెస్మరైజ్ వాయిస్ తో ఆకట్టుకున్నారు. ఈ పాటలో రవితేజ, గాయత్రి భరద్వాజ్ ల కెమిస్ట్రీ వండర్ ఫుల్ గా వుంది. విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి.

నూపుర్ సనన్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్భంగా అక్టోబర్ 20న అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.

తారాగణం:

రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు

సాంకేతిక విభాగం :

రచయిత, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ : ఆర్ మదీ