డబ్బింగ్ పనుల్లో పురుషోత్తముడు మూవీ

Published On: January 25, 2024   |   Posted By:

డబ్బింగ్ పనుల్లో పురుషోత్తముడు మూవీ

శ్రీ శ్రీదేవి ప్రోడుక్షన్స్ బేనర్ లో రాజ్ తరుణ్ హీరో గా రామ్ భీమన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పురుషోత్తముడు చిత్రం రాజమండ్రి లో వేసిన భారి సెట్ లో టాకీ పూర్తి చేసుకున్న సంధర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు ఆదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు. నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో భారీ తారాగణం తో పాటు సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, చిత్రం గొప్ప విజయం సాధించబోతుందని తెలిపారు. తన కెరీర్ లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని కెమెరామెన్ పి.జి.విందా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

నటీనటులు:

రాజ్ తరుణ్, హాసిని సుధీర్(నూతన పరిచయం), మురళి శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముకేష్ ఖన్నా, రాజా రవీంద్ర,రాజ్ తిరన్ దాస్, అనంత్,
సమీర్,సత్య, ప్రవీణ్, కవిత, విరాన్, సుభాష్,జ్వాల కోటి, రచ్చ రవి, నాగ భైరవ అరుణ్,ముక్తార్ ఖాన్, లక్ష్మణ్, కంచరపాలెం రాజు, హరిశ్చంద్ర

సాంకేతిక వర్గం :

రచన & దర్శకుడు: రామ్ భీమన
నిర్మాతలు :DR.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్
ఎడిటర్ :మార్తాండ్ కె వెంకటేష్
సంగీత దర్శకుడు :గోపి సుందర్
సినిమాటోగ్రఫీ :PG విందా