డిగ్రీ కాలేజీ హీరో వరుణ్ నిత్యావసరాలు సరఫరా

క‌రోనా మ‌హ్మ‌మారి రోజురోజుకి విజృభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేశ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా నెల‌కొంది అంతే ధీటుగా తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సైతం నివార‌ణ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాయి. ప్ర‌‌భుత్వం తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు మ‌ద్ధ‌త్తుగా ప‌లువురు పారిశ్రామికవెత్త‌లు, సినీ ప్ర‌ముఖులు భారీ ఎత్తున ఆర్ధిక స‌హకారం అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో డిగ్రీ కాలేజీ హీరో వరుణ్ ఈరోజు (ఏప్రిల్ 9న) అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర 100 మంది ఆర్టిస్టులకు నిత్యావసరాలు సరఫరా చేశారు.

ఈ సందర్భంగా హీరో వరుణ్ మాట్లాడుతూ…
నా పుట్టినరోజు సందర్భంగా ఇటీవల కొందరు ఆర్టిస్ట్స్ కు నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇటీవల కెసిఆర్ గారి స్పీచ్ విన్నాను, రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందన్నారు, అందుచేత  మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర యూనియన్ కార్డ్ లేని 100 ఆర్టిస్ట్స్ కు బియ్యం, ధాన్యాలు ఇవ్వడం జరిగింది. భవిషత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చెయ్యబోతున్నాను. కరోన ఎఫెక్ట్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆర్టిస్టులకు ఇలా సహాయం చేయడం సంతోషంగా ఉంది, కృష్ణ నగర్ ఏరియా లో అన్నపూర్ణ క్యాన్టీన్ రావడానికి మా అంకుల్ వి.ప్రకాష్ (వాటర్ రిసోర్స్ అండ్ ఇరిగేషన్ ఛైర్మెన్) ద్వారా కెసిఆర్ గారికి చెప్పిస్తున్నానని తెలిపారు