డెవిల్ మూవీ ఎల్నాజ్ నోరౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: October 21, 2023   |   Posted By:

డెవిల్ మూవీ ఎల్నాజ్ నోరౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స్పై థ్రిల్ల‌ర్ డెవిల్ లో రోజీగా అలరించనున్న బాలీవుడ్ సెన్సేషన్ ఎల్నాజ్ నోరౌజీ

నందమూరి కళ్యాణ్ రామ్ విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం డెవిల్. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ నిర్మించారు.

రీసెంట్‌గా రిలీజైన డెవిల్ మూవీ టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. న‌వంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల మాళ‌వికా నాయ‌ర్ పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా బాలీవుడ్ సెన్సేష‌న్ ఎల్నాజ్ నోరౌజీ పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. ఈ మూవీలో ఆమె రోజీ పాత్ర‌లో అల‌రించ‌నుంది.

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ ఎల్నాజ్ నోరౌజీ మా డెవిల్ చిత్రంలో రోజీ పాత్ర‌లో అల‌రించ‌నుంది. ఆమె సిల్వ‌ర్ స్క్రీన్ ప్రెజ‌న్స్ ప్రేక్ష‌కుల‌ను థియేటర్స్ రప్పిస్తుంది. ఆమె ఈ చిత్రంలో త‌న‌దైన అద్భుత‌మైన డాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకోనుంది. దానికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్ పోస్ట‌ర్ సాక్ష్యం అంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై డెవిల్ సినిమా రూపొందుతోంది. గాంధీ న‌డికుడిక‌ర్ ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఆయ‌న అందించిన వ‌ర్క్ ఓ విజువ‌ల్ ట్రీట్‌ను అందిస్తుంది. సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో డెవిల్ సినిమాను న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. డెవిల్ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు.

దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌కుడిగా  అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

న‌టీన‌టులు :

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, సంయుక్త త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ‌: దేవాన్ష్ నామా
బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌
డైరెక్టర్, ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా
సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్‌: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు