డెవిల్ మూవీ మాళ‌వికా నాయ‌ర్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: October 16, 2023   |   Posted By:

డెవిల్ మూవీ మాళ‌వికా నాయ‌ర్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ డెవిల్ లో పవర్ఫుల్ పొలిటీషియన్‌గా మాళ‌వికా నాయ‌ర్‌ లుక్ విడుద‌ల‌

నందమూరి కళ్యాణ్ రామ్ విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం డెవిల్. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆదివారం ఈ మూవీలో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటీషియ‌న్ పాత్ర‌లో న‌టిస్తోన్న హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ పాత్ర‌కు సంబంధించిన లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

మ‌ణిమేక‌ల పాత్ర‌లో మాళ‌వికా నాయ‌ర్ క‌నిపించ‌నున్నారు. ఆమె లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్లో క‌నిపిస్తున్నారు. మైకు ముందు నిలబ‌డి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న‌ట్లు ఉంది. అయితే ఆమె పాత్ర‌కు ఈ సినిమాకు క‌థ‌కు ఉన్న లింకేంట‌నేది తెలుసుకోవాలంటే మాత్రం న‌వంబ‌ర్ 24న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు నిర్మాత‌లు.

పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో డెవిల్ సినిమాను న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. డెవిల్ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన బింబిసారతో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది డెవిల్తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు.

దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌కుడిగా అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

న‌టీన‌టులు :

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, సంయుక్త, మాళ‌వికా నాయ‌ర్‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ‌: దేవాన్ష్ నామా
బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌
డైరెక్టర్, ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా
సీఈఓ : వాసు పోతిని
సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌
మ్యూజిక్‌: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు