తెలంగాణ సీఎం స‌హాయ‌నిధికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విరాళం
 
తెలంగాణ సీఎం స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. 
 
క‌రోనా వ్యాధి వ్యాప్తి మరియు నిర్మూలనకు తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి త‌మ వంతు భాగ‌స్వామ్యం అందించ‌డానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ముందుకు వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు విరాళంగా కొన్ని రోజుల క్రితం సంస్థ తరపున నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ ప్రకటించారు. ఆ మేర‌కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు  శుక్ర‌వారం గౌరవనీయులు అయిన మంత్రి కేటీఆర్‌ ను క‌లిసి రూ. 10 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు.