తెలుగు సినీ కార్మికుల కోసం హీరో శ‌ర్వానంద్ విరాళం

తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం హీరో శ‌ర్వానంద్ రూ. 15 ల‌క్ష‌ల విరాళం

హీరో శ‌ర్వానంద్ ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు తొలిసారిగా ‘ఐయామ్ శ‌ర్వానంద్’ అనే ట్విట్ట‌ర్ అకౌంట్‌తో సోష‌ల్ మీడియాలో అడుగుపెట్టారు. దిన‌స‌రి వేతనంతో ప‌నిచేసే కార్మికులు సినిమా సెట్ల‌పై అంద‌రికంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతుంటార‌ని పేర్కొన్న ఆయ‌న‌, షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’కి రూ. 15 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తూ, అంద‌రూ త‌మ ఇళ్ల‌ల్లోనూ సుర‌క్షితంగా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వాలు, వైద్యులు ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తున్న స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను పాటించి ఆరోగ్యంగా ఉండాల‌ని శ‌ర్వానంద్ కోరారు.