దలపతి 67 మూవీ లో త్రిష కృష్ణన్

Published On: February 1, 2023   |   Posted By:

దలపతి 67 మూవీ లో త్రిష కృష్ణన్

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్, 7 స్క్రీన్ స్టూడియో దలపతి 67 లో త్రిష కృష్ణన్

దళపతి విజయ్ 67, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ కాస్టింగ్, సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువల పరంగా భారీగా ఉండబోతోంది. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

దలపతి67లో సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్ , శాండీ మాస్టర్ వంటి ప్రముఖ తారాగణం అలరించబోతోంది. ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ కు జోడిగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్‌తో త్రిషకు ఇది ఐదవ సినిమా. ఈ మ్యాజికల్ పెయిర్ 14 ఏళ్ల తర్వాత కలిసి పని చేయనున్నారు.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్, ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

దలపతి 67 నటీనటులు, టీంకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

తారాగణం :

విజయ్, త్రిష కృష్ణన్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్

టెక్నికల్ టీం :

రచన, దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
నిర్మాత : ఎస్ ఎస్ లలిత్ కుమార్
బ్యానర్ : 7 స్క్రీన్ స్టూడియో
సంగీతం : అనిరుధ్ రవిచందర్‌
డిఓపి – మనోజ్ పరమహంస,
ఎడిటింగ్ – ఫిలోమిన్ రాజ్