న‌రేష్   విలేక‌రుల స‌మావేశం

ఈ ఏడాది  మ‌రిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకు రాబోతోన్నాను – డా. న‌రేష్ విజ‌య‌కృష్ణ‌

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వీకే పుట్టిన రోజు (జనవరి 20) సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ గురించి మీడియాతో ముచ్చటించారు. నటుడిగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సినీ కెరీర్ గురించి ప్రస్థావించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి యాభై ఏళ్లు అవుతుండటంతో ఈ ఏడాది నుంచి తన నిర్మాణ సంస్థలో కొత్త సినిమానులను నిర్మిస్తున్నట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా…

న‌రేష్ విజ‌య‌కృష్ణ మాట్లాడుతూ –  ‘జనవరి 20 నా పుట్టిన రోజు. నా అభిమానులు, పాత్రికేయ సోదరులు అందరితో కలిసి జరుపుకుంటాను. కానీ రమేష్‌ని మిస్ అవుతున్నాం. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బర్త్ డేను సెలెబ్రేషన్స్ చేసుకోవడం లేదు. నా జీవితంలో జరిగే వాటిని ఇలా పంచుకోవడం సహజం. అందుకే ఇలా కలుస్తాను. 1972లో పండంటి కాపురం సినిమాతో తెరంగేట్రం చేశాను. కృష్ణ గారు, విజయ నిర్మల గారు, గుమ్మడి గారు, జయసుధ గారు ఇలా అందరూ పరిచయం అయ్యారు. నాకు నటుడిగా యాభై ఏళ్లు నిండాయి. ఇంతటి సుధీర్ఘ ప్రయాణం చాలా అరుదుగా ఉంటుంది. ఇంత జర్నీ చేసేందుకు కారణమైన సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల గారికి థ్యాంక్స్. నా గురువు జంధ్యాల గారికి థ్యాంక్స్. ఈ యాభై ఏళ్లలో ఓ పదేళ్లు సామాజిక సేవకు అంకితం చేశాను. పొలిటికల్‌గా కూడా వెళ్లాను. అనంతపురంలో సేవలు చేశాను. చెరువులు నింపడం, అంతరించిపోతోన్న కళల కోసం ఓ ఐదేళ్లు నా జీవితాన్ని అంకితం చేశాను. అలానే ఇండస్ట్రీలో పుట్టిన బిడ్డగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం పాటు పడ్డాను. యాభై ఏళ్ల ప్రయాణం తరువాత ఇప్పుడు కూడా కొత్త కొత్త పాత్రలు వేస్తున్నాను. నన్ను ఆదరిస్తున్న సినీ పరిశ్రమలోని ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో కారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వచ్చినప్పుడు ఎస్వీరంగారావు గారిని స్పూర్తిగా తీసుకున్నాను. ఎలాంటి పాత్రలైనా చేయాలని అనుకున్నాను. యువ దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లు, గెటప్‌లతో రావడం ఆనందంగా ఉంది. భారతదేశంలో నేడు తెలుగు సినిమా పరిశ్రమ విజయభావుట ఎగరవేస్తోంది. కొత్త బాటలో వెళ్తున్నాం. ఈ సమయంలో నేను ఒక బిజీ ఆర్టిస్ట్‌గా ఉండటం, రైటర్స్ మనసులో నేను ఇంకా ఉండటం నా పూర్వ జన్మ సుకృతమని భావిస్తున్నాను. విజయ కృష్ణ మూవీస్ ప్రారంభించి యాభై ఏళ్లు అవుతోంది. వాళ్ల నేతృత్వంలో మీనా, కవిత, హేమాహేమీలు, అంతం కాదు ఇది ఆరంభం అనే ఎన్నో గొప్ప చిత్రాలను తీశారు. విజయ కృష్ణ మూవీస్‌ను విజయ కృష్ణ గ్రీన్ స్టూడియో‌స్‌గా మార్చాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్‌లు చేస్తున్నారు. సినిమా బిడ్డగా నేను కూడా సినిమా పరిశ్రమకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందించాలని అనుకున్నాం. ఈ ఏడాదితో అమ్మ పేరుతో ఈ స్టూడియోను అందిస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని కృష్ణగారు అభినందించారు. ఎయిర్ కండీషన్ ఫ్లోర్స్ కూడా రెడీ చేస్తున్నాం. ప్రీలిట్ సెట్స్ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఎక్కడా లేదు.  భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకుని మేం దీన్ని రెడీ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం సినిమాలను నిర్మించాలనేది మా సంకల్పం. తరం మారింది. థియేటర్లు, ఓటీటీ, కొత్త దర్శకులు వస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ బేస్డ్‌గా మంచి సినిమాలను ఈ ఏడాది అందించాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఈ ప్రెస్ మీట్‌ను నిర్వహించాం. కొత్త దర్శకులు వస్తున్నారు. న్యూ జనరేషన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తీయాలని అనుకుంటున్నాం. విజయ కృష్ణ మూవీస్ పతాకాన్ని మళ్లీ ఎగరవేయాలని అనుకుంటున్నాం. చాలా మంది నన్ను లక్కీ ఆర్టిస్ట్ అని అంటారు. నేను నిజంగానే లక్కీ. మంచి సినిమాల్లో నన్ను తీసుకున్నందుకు నేను లక్కీ. మంచి హిట్ సినిమాల్లో పాత్రలు వేశాను. జాతి రత్నాలు, దృశ్యం 2, భీష్మ, శ్రీదేవీ సోడా సెంటర్‌లో పూర్తిగా నెగెటివ్ రోల్‌ వేశాను. ఇలా నేను మంచి సినిమాల్లో నటించి, బిజీగా ఉండటం నా అదృష్టం. ఈ ఏడాది కూడా మంచి చిత్రాలతో మీ ముందుకు రాబోతోన్నాను. మైత్రీ, నాని సినిమా అంటే సుందరానికీలో మంచి రోల్‌ పోషిస్తున్నాను. నందినీ రెడ్డి గారి అన్నీ మంచి శకునాలే సినిమాలో మరో సినిమాను చేస్తున్నాను. వరుణ్ తేజ్ గనిలో మంచి రోల్ చేస్తున్నాను. వైష్ణవ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తున్నాను. దీంతో పాటు చాలా కొత్త పాత్రలు వస్తున్నాయి. ఇంకొన్ని లీడ్ రోల్స్ వస్తున్నాయి. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వెబ్ సిరీస్, నిహారిక తీసిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ బాగా నిలబడింది. ఇదంతా తెలుగు పరిశ్రమ ముందుకు వెళ్తోందనే పాజిటివ్ సైన్. దాంట్లో భాగంగా నేను కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నాను. రానున్న రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో విజయ కృష్ణ మూవీస్ అలరించబోతోంది. వెల్ఫేర్ విభాగంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో బెంచ్ మార్క్ క్రియేట్ చేశాం. మేం చేసిన కార్యక్రమాల వల్లే గత ఎన్నికల్లో మేం గెలిచాం. మమ్మల్ని గౌరవించి గెలిపించిన మా సభ్యులకు థ్యాంక్స్. అధ్యక్షుడిగా ఒకేసారి పోటీ చేస్తాను అని చెప్పాను. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా నా సపోర్ట్ ఇస్తాను. సినిమా బిడ్డగా నేను ముందుంటాను అని చెప్పాను. ఈ శ్రామ్‌లో సినిమా కార్మికులందరికీ ఈ కార్డ్‌లను ఇప్పించాలని ప్రయత్నిస్తున్నాం. సినిమా నాకు సక్సెస్ ఇచ్చింది కాబట్టి.. సినిమా బిడ్డగా నేను ఎవ్వరికైనా సేవ చేసేందుకు రెడీగా ఉన్నాను. సినీ పరిశ్రమకు సేవ అనేది నా బాధ్యత. కళాకారుల ఐక్య వేదికను స్థాపించి పదేళ్లు అవుతుంది. పదకొండు వేల సభ్యులున్నారు. అంతరించిపోతోన్న కళల మీద పదేళ్లుగా పని చేస్తున్నాం. తోలు బొమ్మలాటల వంటి వాటి మీద పని చేస్తున్నాం. ఈ సంస్థ ద్వారా మా మెంబర్లు, సినిమా కార్మికులకు కూడా సేవా చేస్తామని చెప్పదలుచుకున్నాను.

నాలుగు స్థంభాల సినిమా చేస్తోన్న సమయంలో నాకు 17 ఏళ్లు. గౌరవం ఆశించకు. ప్రతీ ఒక్కరికీ నువ్ గౌరవం ఇవ్వు. సెట్‌లో లైట్ బాయ్ నుంచి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు అని మా అమ్మ గారు చెప్పారు. నేను అదే ఫాలో అవుతుంటాను. ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తాను. అందరినీ కలుపుకుపోవడం, కలిసి పని చేయడం, దర్శకులు చెప్పింది చేయడం వంటి వాటి వల్లే నేను ఇంకా టాప్‌లో ఉన్నాను. నిర్మాతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కాంట్రవర్సీల జోలికి వెళ్లలేదు. నేను కూడా ఓ నిర్మాతే. దాదాపు 30 సినిమాలు నిర్మించాను. ఎవరైనా కొత్త వారు వస్తే.. రెమ్యూనరేషన్ గురించి ఆలోచించను. శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. సితార ఎంటర్టైన్మెంట్స్, నవీన్ పొలిశెట్టి సినిమాను కూడా చేస్తున్నాను. మంచి సినిమాకు ఎప్పుడూ అండగా ఉంటాను. సినీ పరిశ్రమ, ప్రభుత్వం కలిసి త్వరలోనే మంచి నిర్ణయానికి వస్తారని ఆశిస్తున్నాను. ఎంతో ఓటీటీ వచ్చినా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ వేరు. త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాను. చర్చలు జరుగుతున్నాయి. పరిశ్రమ, ప్రజలు, ప్రభుత్వానికి అనుసంధానమైంది. ఈ విషయంలో ప్రభుత్వం, పరిశ్రమ కలిసి మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. మా అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ సంక్షేమం కోసమే పెట్టాం. ‘మా’ను ఈ పాలిటిక్స్‌లో భాగంగా చూడకూడదు. మా సభ్యుల సంక్షేమం కోసం మెడికవర్‌లో 30 కార్పోరేట్ ఆస్పత్రులతో టై అప్ అయ్యాం. మేం మెంబర్ల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం. ఛాంబర్, నిర్మాతలు అందరూ త్వరలోనే ప్రభుత్వాన్ని కలుస్తారని, మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాను. పొలిటికల్‌గా పదవులు ఆశించి ఎప్పుడూ నేను రాజకీయాల్లోకి రాలేదు. సామాజిక సేవ కోసం అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నా దృష్టి అంతా కూడా సినిమాల మీదే ఉంది. సినీ పరిశ్రమ మీద దాదాపు 22 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వారి కోసం ఆలోచించాలని, సినిమాల మీదే ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. సినిమా పరిశ్రమ నన్ను గౌరవించి ఇన్ని మంచి పాత్రలు ఇస్తోంది. నేను రచయితనే. దర్శకత్వం అనేది చాలా పెద్ద బాధ్యత. ఆరు నెలలు ఒక సబ్జెక్ట్ మీద కూర్చోవాలి. రాజకీయాల్లోకి వెళ్లిన పదేళ్లు.. నటుడిగా నన్ను నేను మిస్ అవుతున్నాను అని డిప్రెషన్‌లోకి వెళ్లాను. అప్పుడు నటుడిగా నేను ఏం మిస్ అయ్యానో.. దాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. చేయకూడదని లేదు.. భవిష్యత్తులో చేస్తానేమో. ఇప్పుడున్న పరిస్థితులో ఈ ఏడాదిలో కరోనాను దాటి మంచి సినిమాలు ఇవ్వగలిగితే చాలు. అదే మాకు గర్వంగా ఉంటుంది. సంక్రాంతికి అశోక్ గల్లా సినిమా విడుదలైంది. మంచి టాక్ వచ్చింది. మంచి పాత్రను చేశాను. ఈ ఏడాది అందరికీ బాగుండాలని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.