పాయల్ రాజ్‌పుత్ కొత్త సినిమా ఫస్ట్ లుక్

మార్చి 4న పాయల్ రాజ్‌పుత్ కొత్త సినిమా ఫస్ట్ లుక్

తెలుగులో పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, ఎక్కువమంది ప్రేక్షకులకు ఆమె తెలుసు. తొలి తెలుగు చిత్రం ‘ఆర్ఎక్స్ 100’, తర్వాత ‘ఆర్‌డిఎక్స్ లవ్’తో గ్లామర్ నాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటనకు ఆస్కారమున్న పాత్రలు చేసినప్పటికీ, పాయల్ రాజ్‌పుత్‌ను గ్లామర్ భామగా మెజారిటీ ప్రేక్షకులు చూస్తున్నారు. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఆమె ఒక సినిమా చేస్తున్నారు. త్వరలో పోలీస్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ డ్రామా. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకూర్ నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ ఐపీఎస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మార్చి 4న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రణదీప్ మాట్లాడుతూ “ఇప్పటివరకూ పాయల్‌ను ప్రేక్షకులు ఒక విధంగా చూశారు. ఈ సినిమాలో ఆమెను మరో విధంగా చూస్తారు. పాయల్ ఇమేజ్ మార్చే విధంగా ఆమె క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమా ఆమెకు ఇమేజ్ ఛేంజోవర్ ఫిల్ అవుతుంది. నటిగా వైవిధ్యం చూపిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటాయి” అని అన్నారు. 

నిర్మాత శ్రీమతి యశోద ఠాకూర్ మాట్లాడుతూ “ఒక షెడ్యూల్ మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. మార్చి మొదటివారంలో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. మార్చి నెలాఖరుకు సినిమా మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా పూర్తి చేసి వేసవిలో సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి,   ప్రొడ్యూసర్: కైవల్య క్రియేషన్స్ డైరెక్టర్: ప్రణదీప్.