పి.వి.నరసింహారావు బయోపిక్ హాఫ్ లయన్ పై అందరిలోనూ పెరిగిన ఆసక్తి

Published On: February 28, 2024   |   Posted By:

పి.వి.నరసింహారావు బయోపిక్ హాఫ్ లయన్ పై అందరిలోనూ పెరిగిన ఆసక్తి

ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారతరత్నఅవార్డు గ్రహీత పి.వి.నరసింహారావు బయోపిక్ హాఫ్ లయన్పై అందరిలోనూ పెరిగిన ఆసక్తి

మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు గారికి ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోనే అత్యున్నతమైన
పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కొత్తపుంతలు తొక్కించటంలో ఆయనెంతో కీలకంగా వ్యవహరించారు.

ఇదే సమయంలో ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి మన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు బయోపిక్‌ హాఫ్ లయన్ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. పలు భాషలలో రూపొందుతున్నఈ బయోపిక్ పి.వి.నరసింహారావు జీవిత చరిత్రను వివరిస్తుంది. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన హాఫ్ లయన్ పుస్తకం ఆధారంగా,జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రకాష్ ఝా ఈ సిరీస్‌కు రూపోందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియాన్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు.

పి.వి.నరసింహారావు గొప్ప జీవన ప్రయాణాన్ని ఇది హైలైట్ చేయనుంది. దీంతోహాఫ్ లయన్కు సంబంధించిన మునుపటి ప్రకటనకు మరింత ప్రాముఖ్యత పెరిగింది.