ప్రారంభమైన శ్రీ శ్రీనివాస స్క్రీన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1చిత్రం

తొలి ఏకాదశి సందర్బంగా వైజాగ్ ఆర్ కె. బీచ్ లో ఘనంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస స్క్రీన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1చిత్రం

బెక్కం మాధవి, బెక్కం ప్రొడక్షన్స్ సమర్పణలో  శ్రీ శ్రీనివాస స్క్రీన్స్  బ్యానర్ పై కార్తిక్ రత్నం ,హ్రితిక శ్రీనివాస్, పృద్వి (పెళ్లి),కాలకేయ ప్రభాకర్,మహేంద్రనాద్ , సి.ఎం.ఆర్. శర్మ , కాళిచరణ్ సంజయ్ నటీ నటులుగా అరుణ్ కొత్తపల్లి  దర్శకుడుగా పరిచయం చేస్తూ బెక్కం రవీందర్  నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో ప్రారంభమైంది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన  స్టార్ మేకర్ సత్యానంద్ గారు చిత్ర హీరో, హీరోయిన్స్ పై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, మహేందర్ చక్రవర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు అరుణ్ కొత్తపల్లి గౌరవ దర్శకత్వం  వహించారు.
పూజ కార్యక్రమాల అనంతరం చిత్ర నిర్మాత బెక్కం రవీందర్  మాట్లాడుతూ స్టార్ మేకర్ సత్యానంద్ గారు ఎంతో బిజీగా  ఉన్నా  మేము అడిగిన వెంటనే మమ్మల్ని, మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు. చిత్ర దర్శకుడు కొత్తవారైనా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఫాదర్, సన్ ల మధ్య జరిగే ఏమోషనల్,క్రైమ్ కామెడీ స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈ రోజు నుండి పది రోజులు వైజాగ్ లోని పలు అందమైన లొకేషన్స్ లలో షూటింగ్ జరుపుకుని ఆ తరువాత జరిగే రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లో జరుపుకుంటుంది. నటీ, నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ మా సినిమాకు చాలా చక్కగా కుదిరారు. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు

నటీ నటులు
కార్తిక్ రత్నం ,హ్రితిక శ్రీనివాస్, పృద్వి (పెళ్లి ),కాలకేయ ప్రభాకర్,మహేంద్రనాద్ , సి. ఎం. ఆర్. శర్మ , కాళిచరణ్ సంజయ్  తదితరులు

సాంకేతిక నిపుణులు :
సమర్పణ : బెక్కం మాధవి, బెక్కం ప్రొడక్షన్స్
బ్యానర్ : శ్రీ శ్రీనివాస స్క్రీన్స్
నిర్మాత : బెక్కం రవీందర్
డైరెక్టర్ : అరుణ్ కొత్తపల్లి
ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ మామిడి ,
సంగీతం :  స్మరన్
కెమెరామాన్ : సతీష్ రెడ్డి మాసం
పి. ఆర్. ఓ : మధు వి. ఆర్
ఫైట్స్ : మల్లేష్,
క్యాస్టూమ్ డిజైనర్ : అశ్వంత్
మేకప్ చీఫ్ : రంజిత్
క్యాస్టూమ్ చీఫ్ : వెంకటేశ్వర రావు
ప్రొడక్షన్ కంట్రోలర్ : ప్రభాకర్ రాజు, వైజాగ్ రాంబాబు
మేనేజర్స్ : మురళి, శీను, రాణి