`ప్రేమ పిపాసి`   టీజ‌ర్ లాంచ్‌
 
 
ఎస్‌.ఎస్‌.ఆర్ట్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకం పై రాహుల్ భాయ్ మీడియా మ‌రియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమ‌ పిపాసి` .పి.ఎస్‌.రామ‌కృష్ణ  (ఆర్ కే ) ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి ముర‌ళీరామ‌స్వామి ( ఎమ్ ఆర్ ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జిపిఎస్‌, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సోనాక్షివ‌ర్మ‌ హీరో హీరోయిన్స్  గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో గ్రాండ్ గా జరిగింది.
 
 
ఈ సందర్భంగా గెస్ట్ గా విచ్చేసిన  పి.వి.ఆర్ విష్ణు మాట్లాడుతూ… “ప్రొడ్యూసర్ రామ‌కృష్ణ గారు నాకు గ‌త ఆరు నెల‌లుగా ప‌రిచ‌యం. సినిమాల పట్ల అభిరుచి ఉన్న నిర్మాత . ఇక టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.   టీజర్ చూసాక ద‌ర్శ‌కుడు మురళి కష్టం ఏంటో క‌నిపిస్తుంది.  మూవీ హిట్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
 
 
 
చిత్ర నిర్మాత  పి. ఎస్ రామ‌కృష్ణ‌మాట్లాడుతూ… “ నిర్మాతగా ఇది  నా ఫ‌స్ట్ సినిమా.  హీరో జిపిఎస్ పెర్ఫార్మెన్స్  టీజర్ లో చూసింది కొంచమే . ఈ సినిమా తో మరో సేన్సేషనల్ హీరో పరిచయ మవు తున్నాడు. ఇక మా డైరెక్టర్ మురళి గారు అన్నీ తానై ఈ సినిమాకు పని చేసారు. టీజర్ బట్టి తన టాలెంట్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది.  ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి.  నా ఫ్రెండ్ యుగంధర్  వ‌ల్లే నేను ఈ సినిమాని  ముందుకు తీసుకురాగ‌లిగాను.  ఎక్క‌డా ఖ‌ర్చుకి వెన‌కాడ‌లేదు. సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అతి  త్వరలో ఆడియో రిలీజ్ చేసి సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు. 
 
 
 
కో -ప్రొడ్యూసర్ రాహుల్ పండిట్ మాట్లాడుతూ…“మంచి కంటెంట్ ఉంటే  ఫండింగ్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తారు. నేను జీపిఎస్ ద్వారా ఈ సినిమాలో పార్ట్ అయ్యాను . డైరెక్టర్ మురళి చెప్పిన కంటెంట్ నచ్చి సినిమా నిర్మించాం “ అన్నారు. 
 
 
 
హీరోయిన్ సోనాక్షి వర్మ  మాట్లాడుతూ… “నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ ప్రొడ్యూస‌ర్‌కి థాంక్స్ “ అన్నారు. 
 
 
 
క‌పిలాక్షి మల్హోత్రా  మాట్లాడుతూ…“ నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు.
 
 
డైరెక్ట‌ర్ మురళి రామస్వామి మాట్లాడుతూ … “ పోస్టర్ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా సినిమా చాలా  క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుంది.   సినిమాను చాలా `రా` గా తీసాం.   ప్రతి మనిషి లో  మరో  మరో కోణం  ఉంటుంది .. . అదే మా సినిమా.  లవ్ , రొమాన్స్ , యాక్ష‌న్, కామెడీ, తో పాటు మంచి మ్యూజిక్ ఉంటుంది .  కచ్చితంగా అందరికి నచ్చే సినిమా అవుతుంది “ అన్నారు. 
 
 
 
హీరో జిపిఎస్ మాట్లాడుతూ… “ ప్రాణం పెట్టి సినిమా చేసాము. ప్రతి ఒక్కరు ఫుల్ ఎఫర్ట్ పెట్టారు .   మా నిర్మాత  రామకృష్ణ గారు ప్యాషనేటెడ్ పర్సన్. ఎక్కడా  ఖర్చుకి వెనకాడ లేదు. నేను ఇందులో ఇంత రఫ్ గా, రా గా నటించాను అంటే మా డైరెక్టర్ మురళి గారి వల్లే   . మా డైరెక్ట‌ర్ ఎక్స్‌ట్రాడిన‌రీ టాలెంటెడ్‌.  బ్రేక్ ద రూల్స్ అనేలా మా సినిమా ఉంటుంది“ అన్నారు. 
 
 
 
సినిమాటోగ్రాఫర్ తిరుమల మాట్లాడుతూ“డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫ్రీ డమ్  తో మంచి ఔట్పుట్ ఇవ్వగలిగాం“ అన్నారు. 
 
 
ఈ కార్యక్రమము లో జగన్నాథ్, శ్రీరామ్, జ్యోతి రాజ్ పుత్, ప్రొడక్షన్ డిజైనర్ రామస్వామీ   
( పండు)  తదితరులు పాల్గొని టీజర్ పట్ల తమ అభిప్రాయాన్ని తెలియజేసారు. 
 జిపిఎస్ , కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్ పుత్, మమత శ్రీ చౌదరి,  `ఢీ  జోడి ఫేమ్` అంకిత , బిగ్ బాస్ ఫేమ్ బందగీ కర్ల ,  సంజన చౌదరి , సుమన్ , భార్గవ్ , షేకింగ్ శేషు, జబ్బర్దస్థ్ రాజమౌళి, ఫసక్  శశి, ఫన్ బకెట్ భరత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డీఓపీ తిరుమల రోడ్రిగ్జ్ , మ్యూజిక్: ఆర్స్ ,  పాటలు : సురేష్ ఉపాధ్యాయ-అల రాజు,  సౌండ్ డిజైన్ :యతిరాజ్ , పీఆర్వో : వంగాల కుమారస్వామి ,  ఎడిటర్: ఎస్ శివ కిరణ్, ఫైట్స్: మిస్టర్ దేవ్,  కో-ప్రొడ్యూసర్స్ : రాహుల్ పండిట్, జిఎస్ రావు, వై వెంకట లక్ష్మి , ప్రొడ్యూసర్స్ : పియస్ రామకృష్ణ (ఆర్కే), రచన-దర్శకత్వం: మురళి రామస్వామి  (ఎమ్ .ర్ ).