ఫియర్ మూవీ హీరోయిన్ వేదిక పుట్టినరోజు పోస్టర్ రిలీజ్

Published On: February 21, 2024   |   Posted By:

ఫియర్ మూవీ హీరోయిన్ వేదిక పుట్టినరోజు పోస్టర్ రిలీజ్

టాలెంటెడ్ హీరోయిన్ వేదిక పుట్టినరోజు సందర్భంగా “ఫియర్” మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

కాంచన 3, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలెంటెడ్ హీరోయిన్ వేదిక. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి మరియు సామ సురేందర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.

ఇవాళ హీరోయిన్ వేదిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ “ఫియర్” మూవీ టీమ్  ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో వేదిక బ్యూటిఫుల్ మేకోవర్ లో కనిపించి ఆకట్టుకుంటోంది. “ఫియర్” సినిమాలో వేదిక క్యారెక్టర్ కొత్తగా ఉంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఆమె కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం “ఫియర్” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ – అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ
ఎడిటింగ్ – గ్యారీ బీ హెచ్
లిరిక్స్ – కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ – విశాల్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా
డిజిటల్ మీడియా – హౌస్ ఫుల్, మాయాబజార్
నిర్మాత – ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్స్ – సుజాత రెడ్డి, సామ సురేందర్ రెడ్డి
రచన, దర్శకత్వం – హరిత గోగినేని