బచ్చల మల్లి మూవీ కీలక షూటింగ్ షెడ్యూల్ పూర్తి

Published On: March 5, 2024   |   Posted By:

బచ్చల మల్లి మూవీ కీలక షూటింగ్ షెడ్యూల్ పూర్తి

అల్లరి నరేష్, సుబ్బు మంగాదేవి, హాస్య మూవీస్ బచ్చల మల్లి కీలక షూటింగ్ షెడ్యూల్ పూర్తి

హీరో అల్లరి నరేష్ బచ్చల మల్లి చిత్రం కోసం సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ దర్శకుడు సుబ్బు మంగాదేవితో చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ సామజవరగమనా చిత్రాన్ని అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న్యూ ఏజ్ యాక్షన్ డ్రామాగా యూనిక్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా ఓ కీలక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణంపై సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు.

అల్లరి నరేష్ కు జోడిగా అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట జయరామ్, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్, హరితేజ లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

భారీ స్థాయిలో రూపొందనున్న బచ్చల మల్లిలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. కథ, సంభాషణలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, అదనపు స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందిస్తున్నారు.