బలమెవ్వడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి
 
ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న సినిమా బలమెవ్వడ . వైవిద్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు ఫృథ్విరాజ్, సుహాసిని కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 
 
ఇటీవ‌ల విడుద‌లైన  టీజ‌ర్‌, మ‌ర‌క‌తమ‌ణి ఎం.ఎం.కీర‌వాణి పాడిన టైటిల్ సాంగ్‌.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించే అప్‌డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
 
 ఈ బలమెవ్వడు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న  సందర్భంగా  డైరెక్టర్ సత్య రాచకొండ మాట్లాడుతూ..
 
ఫస్ట్ కాపీ చూసిన తరువాత రీ- రికార్డింగ్ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ గారి సత్తా ఏంటో తెలిసింది , ఆయన కెరీర్ లోనే అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసిన భారీ చిత్రాల మధ్య చేరబోయే మొదటి చిన్న సినిమా బలమెవ్వడు  కాబోతోంది , ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం సినిమాని థియేటర్ మెట్లు ఎక్కించేలా చేసిందని చెప్పారు. హీరో హీరోయిన్స్, ఫృథ్విరాజ్, సుహాసిని గార్ల నటన, కథ, డైలాగ్స్ ఈ బలమెవ్వడు సినిమాకు ప్రధాన బలాలు అని, అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు.