బిచ్చ‌గాడు2 తో సిద్ద‌మ‌వుతున్న  విజయ్ ఆంథోని
 
బిచ్చ‌గాడు2 తో మ‌రో సెన్సేష‌న్ కి సిద్ద‌మ‌వుతున్న  విజయ్ ఆంథోని..
 
విజ‌య్ ఆంథోని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `బిచ్చ‌గాడు 2` ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ ‌లోగో విడుద‌ల.
 
‘బిచ్చ‌గాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు..తెలుగులోనూ బ్లాక్ బస్ట‌ర్ విజ‌యాన్ని సాధించి తెలుగు ప్రేక్ష‌కుల  హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు  విజ‌య్ ఆంథోని . 2016 విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నం సృష్టించింది. తాజాగా జాతీయ అవార్డు గ్ర‌హీత  ప్రియ కృష్ణ స్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విష‌యం తెలిసిందే. ఓ వైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, మ‌రోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటోని పుట్టినరోజు జూలై 24. ఈ సంద‌ర్భంగా  తెలుగు, త‌మిళ భాష‌ల‌లో బిచ్చ‌గాడు 2  ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ ‌లోగోను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. విజ‌య్ ఆంథోని అటువైపు నిల్చొని ఉన్న ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు. 
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన విజ‌య్ ఆంథోని.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల‌ను ప్రేక్షకులకు అందించాల‌ని విజ‌య్ ఆంటోని భావించి ఆయ‌న నిర్మాత‌గా మారి విభిన్నమైన చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.  ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించారు విజ‌య్‌. ఆ త‌ర్వాత  భేతాళుడు, య‌ముడు, ఇంద్ర‌సేన‌, రోష‌గాడు, కిల్ల‌ర్ వంటి వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అలరించారు. ఇప్పుడు  జాతీయ అవార్డు గ్ర‌హీత  ప్రియ కృష్ణ స్వామి ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఆంథోని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా రూపొందుతోన్న బిచ్చ‌గాడు 2 తో మ‌రో సెన్సేష‌న్ కి సిద్ద‌మ‌వుతున్నారు విజయ్ ఆంథోని.