భామాకలాపం 2 వెబ్ సిరీస్ టీజర్ విడుదల

Published On: January 31, 2024   |   Posted By:

భామాకలాపం 2 వెబ్ సిరీస్ టీజర్ విడుదల

ఆహా, డ్రీమ్ ఫార్మర్స్, ప్రియమణి భామాకలాపం 2 టీజర్ విడుదల.. ఫిబ్రవరి 16నుంచి స్ట్రీమింగ్

ప్రియమణి నటించిన భామా కలాపం 2 నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు భామాకలాపం 2 టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో అనుపమ పాత్రలో ప్రియమణి అమాయకపు గృహిణిగా కనిపించారు.

అనుపమ తన గత జీవితాన్ని, అపార్ట్‌మెంట్‌ను విడిచిపెట్టి, ఆమె భర్తకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అనుపమ అనే నేను, పక్కన వాళ్ళ విషయాలలో తలదూర్చను అని, నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని మాట ఇస్తున్నాను అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభం అయింది. అదే సమయంలో దారుణంగా హత్య చేయడo కనిపిస్తుంది. ఆ క్రైం నుంచి ఆమె ఎలా బయటపడింది అనేది ప్రధానాంశం. టీజర్‌లో వినోదంతో పాటు చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

ఈ టీజర్ లో ప్రియమణి, శరణ్య ప్రదీప్ టైమింగ్ నవ్వులు పూయిస్తుంది. డైలాగ్‌, యాక్షన్ ఇలా అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 16న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రాన్ని ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు & సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా.. సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు.

ప్రియమణి భామాకలాపం ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అనుపమ మోహన్ అనే యూట్యూబర్ పాత్రలో ప్రియమణి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇందులో ఆమె ఓ చెఫ్ లా కనిపించారు. ఈ చిత్రం తెలుగు ప్రజల అభిమాన OTT ప్లాట్‌ఫారమ్‌ ఆహాలో సినీ ఔత్సాహికులను ఆకట్టుకుంది. నాలుగు మిలియన్ల వ్యూస్ తో అందరినీ కట్టి పడేసింది.