భీమా సినిమా మంగళూరు షెడ్యూల్ ప్రారంభం

Published On: December 24, 2023   |   Posted By:

భీమా సినిమా మంగళూరు షెడ్యూల్ ప్రారంభం

మాచో స్టార్ గోపీచంద్, ఎ హర్ష, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ‘భీమా’ మంగళూరు షూటింగ్ షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభం

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ఈరోజు మంగళూరులో ప్రారంభమైంది.

గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్‌లో మంగళూరులోని దట్టమైన అడవిలో ఓ సాంగ్‌, యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

మాస్‌, యాక్షన్‌తో కూడిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే అంశాలు ఉంటాయి. హై స్టాండర్డ్ టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్ కాగా, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేస్తున్నారు

తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
డీవోపీ: స్వామి జె గౌడ
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక
ఎడిటర్: తమ్మిరాజు
ఆన్‌లైన్ ఎడిటర్: కిరణ్
డైలాగ్స్: అజ్జు మహంకాళి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంక, డాక్టర్ రవివర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్