మార్చి 15న థియేటర్స్ లో రవికుల రఘురామ చిత్రం

Published On: March 4, 2024   |   Posted By:

మార్చి 15న థియేటర్స్ లో రవికుల రఘురామ చిత్రం

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రవికుల రఘురామ. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో, డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది.

యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారు. అలాగే హీరో హీరోయిన్లు కూడా మంచి పెర్ఫామెన్స్ అందించారు.

వీరందరితో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందిస్తున్నారు. తన సంగీతాన్ని ఈ చిత్రానికి ఒక సోల్ గా మార్చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి చందమామే అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు.

ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత శ్రీధర్ వర్మ ఈ సినిమాను పాజిటీవ్ వైబ్స్ ప్రొడక్షన్స్ లో నిర్మించారు. యూత్ కు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాకు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు చంద్రకాంత్ కానూరి. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.