మిషన్ చాప్టర్ 1 మూవీ సంక్రాంతి విడుదల

Published On: December 25, 2023   |   Posted By:
మిషన్ చాప్టర్ 1 మూవీ సంక్రాంతి విడుదల

 

 

సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్,  లైకా ప్రొడక్షన్స్  భారీ చిత్రం ‘మిషన్ చాప్టర్ 1’

2.0, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలను నిర్మించి అందరి మన్ననలు అందుకుని ఇప్పుడు ఇండియన్ 2, రజినీకాంత్ 170 చిత్రాలతో ఆడియెన్స్‌ని వావ్ అనిపించటానికి సిద్ధమవుతోన్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. భారీ బడ్జెట్ సినిమాలనే కాదు, డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను కూడా పేక్షకులకు అందించటానికి లైకా సంస్థ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ కోవలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ నుంచి రాబోతున్న మరో డిఫరెంట్ మూవీ ‘మిషన్ చాప్టర్ 1’.

అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్, నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా  నటిస్తోన్న ఈ చిత్రంలో  అబి హాస‌న్‌, భ‌ర‌త్ బొప‌న్న‌, బేబి ఇయ‌ల్‌  ప్రధాన పాత్రల్లో మెప్పించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మాత‌లు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘మిషన్:  చాప్ట‌ర్ 1’  తాజాగా లైకా ప్రొడక్ష‌న్స్ నుంచి రాబోతున్న‌క్రేజీ చిత్రాల సినిమాల లిస్టులో చేరింది.  ఈ చిత్రానికి ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మాత‌లు. చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌రించటం గొప్ప విష‌యం.

2.0లో న‌టించి అలరించిన ముద్దుగుమ్మ‌ ఎమీ జాక్స‌న్ ‘మిషన్ చాప్టర్ 1’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె జైలర్ పాత్రలో మెప్పించబోతున్నారు.   మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన  విల‌క్ష‌ణ న‌టి నిమిషా స‌జ‌య‌న్ ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. జి.వి.ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యాన్ని వ‌హిస్తున్నారు. సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

న‌టీన‌టులు:
అరుణ్ విజ‌య్‌, ఎమీ జాక్స‌న్‌, నిమిషా స‌జ‌య‌న్‌, అబి హాస‌న్‌, భ‌ర‌త్ బొప‌న్న‌, బేబి ఇయ‌ల్‌, విరాజ్ ఎస్‌, జాస‌న్ షా తదితరులు

సాంకేతిక‌వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  విజ‌య్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జికెఎం త‌మిళ్ కుమర‌న్‌, నిర్మాత – సుభాస్క‌ర‌న్‌, ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి, కో ప్రొడ్యూస‌ర్‌:  సూర్య వంశీ ప్ర‌సాద్ కోత‌, జీవ‌న్ కోత‌, మ్యూజిక్‌:  జి.వి.ప్ర‌కాష్ కుమార్‌, స్క్రిప్ట్‌, స్క్రీన్ ప్లే:  ఎ.మ‌హ‌దేవ్‌, డైలాగ్స్‌:  విజ‌య్‌, సినిమాటోగ్ర‌ఫీ:  సందీప్ కె.విజ‌య్‌, ఎడిట‌ర్‌:  ఆంథోని, స్టంట్స్ సిల్వ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  శ‌ర‌వ‌ణ‌న్ వ‌సంత్‌, కాస్ట్యూమ్స్ :  రుచి మునోత్‌, మేక‌ప్‌: ప‌ట్టనం ర‌షీద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వి.గ‌ణేష్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కె.మ‌ణి వ‌ర్మ‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ (యుకె):  శివ కుమార్‌, శివ శ‌ర‌వ‌ణ‌న్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ :  మ‌నోజ్ కుమార్‌.కె, కాస్ట్యూమ‌ర్‌:  మొడేప‌ల్లి ర‌మ‌ణ‌, సౌండ్ డిజైన్‌:  ఎం.ఆర్‌.రాజ‌శేఖ‌ర‌న్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  డినోట్‌, స్టిల్స్‌:  ఆర్‌.ఎస్‌.రాజా, ప్రమోష‌న్‌, స్ట్రాట‌జీస్‌:  షియం జాక్‌, పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్ , ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  ప్ర‌తూల్ ఎన్‌.టి.