మిస్టరీ ఆఫ్ సారిక టీజర్ విడుదల
 
అనీషా క్రియేషన్స్ ‘మిస్టరీ ఆఫ్ సారిక’ టీజర్ విడుదల
 
అనీషా క్రియేషన్స్ బ్యానర్ లో బాలాజీ సమర్పణలో సుగుణ సుబ్రమణ్యం నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టరీ ఆఫ్ సారిక’. సాయి  బాబు  , ఆశి రాయ్, సురయ పరివిన్ , హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో రఘుబాబు విలన్ గా నటిస్తుండగా జబర్దస్త్ రాజమౌళి కమెడియన్ గా నటిస్తున్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ పల్లె మాట్లాడుతూ…
ఈ సినిమా టీజర్ ను ఆగస్ట్ 20న విడుదల చేశాము, సస్పెన్స్ తో కూడిన మిస్టరీ ఆఫ్ సారిక సినిమా అందరికి నచ్చే విధంగా ఉండబోతోంది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాము, మా నిర్మాత సుగుణ సుబ్రమణ్యం గారు ఎక్కడ రాజీ పడకుండా సినిమాను నిర్మించారని తెలిపారు.
 
నిర్మాత సుగుణ సుబ్రమణ్యం మాట్లాడుతూ…
డైరెక్టర్ రామ్ పల్లె గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు, సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్   కార్యక్రమాలు జరువుకుంటున్న మా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేశాము, త్వరలో ట్రైలర్, సాంగ్స్ ను రిలీజ్ చెయ్యబోతున్నామని తెలిపారు.
 
నటీనటులు:
సాయి  బాబు, ఆశి రాయ్, సురయ పరివిన్, రఘుబాబు, జబర్దస్త్ రాజమౌళి, బాలాజీ, నెహ్రు బాబు
 
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: అనీషా క్రియేషన్స్
సమర్పణ: బాలాజి ప్రెజెంట్స్
నిర్మాత: సుగుణ సుబ్రహ్మణ్యం
డైరెక్టర్: రామ్ పల్లె
సంగీతం: శ్రీ మిత్ర
కెమెరామెన్: సులమ్ ప్రసాద్
ఎడిటర్: ఈశ్వర్
ఫైట్స్: రాబిన్ సుబ్బు