మిస్టరీ చిత్రం ట్రైలర్ విడుదల

Published On: October 9, 2023   |   Posted By:

మిస్టరీ చిత్రం ట్రైలర్ విడుదల

పి.వి. ఆర్ట్స్ పతాకం పై వెంకట్ పులగం నిర్మాత గా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో స్వప్న చౌదరి, సాయికృష్ణ హీరో హీరోయిన్ గా విలక్షణ నటులు సుమన్, అలీ, తనికెళ్ల భరణి , వెంకట్ దుగ్గి రెడ్డి, రవి రెడ్డి లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం మిస్టరీ. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

దర్శకుడు, హీరో తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ ఆదరిస్తారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు వెంకట్ పులగం, వెంకట్ దుగ్గి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, టైటిల్ లాగానే మంచి మిస్టరీ థ్రిల్లింగ్ అంశాలు ఉన్న చిత్రం ఈ నెల అక్టోబర్ 13న రెండు తెలుగు రాష్ట్రలో మరియు అట్లాంటా లో విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది అని తెలిపారు.

హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ ఈ సినిమా లో నా పాత్ర కి ఆరు రకాల వెరీయేషన్స్ ఉంటాయి, అందరం కష్టపడి పనిచేశాం, టీం వర్క్ వల్లే సినిమా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుంది అని తెలిపారు.

జబర్దస్త్ ఫేమ్ – సత్య శ్రీ మాట్లాడుతూ నేను ఒక జర్నలిస్ట్ పాత్ర చేశాను. సీనియర్ నటులతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

నటీనటులు :

సత్య శ్రీ, గడ్డం నవీన్, అకెల్లా, షన్ను, సి.కే.రెడ్డి, శోభన్ ,నేత

సాంకేతికవర్గం :

సంగీతం- రామ్ తవ్వ
కెమెరా – సుధాకర్ బార్ట్లే
ఎడిటింగ్ – సూర్య తేజ గంజి