మిస్టర్ బచ్చన్ మూవీ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: December 18, 2023   |   Posted By:

మిస్టర్ బచ్చన్ మూవీ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి రవితేజ, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ అప్ కమింగ్ సినిమాలోకి క్లాస్ మహారాణి వచ్చారు. ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటుస్తోంది.

ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మేకర్స్ రిలీజ్ చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో భాగ్యశ్రీ చాలా గ్లామరస్ గా వుంది. చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపించింది.

హరీష్ శంకర్ హీరోయిన్స్ ని అద్భుతంగా చూపిస్తారు. రవితేజ, భాగ్యశ్రీల క్లాస్, మాస్ కాంబినేషన్ ప్రేక్షకులని అలరించబోతుంది.

రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి కలసి చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ట్రేడ్ లోనూ చాలా క్రేజ్ వుంది.

ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం :

రవితేజ, భాగ్యశ్రీ బోర్సే

సాంకేతిక విభాగం :

రచయిత, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ