మెకానిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Published On: January 30, 2024   |   Posted By:

మెకానిక్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

మెకానిక్‌ లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలను ప్రజలు ఆదరించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టీనాశ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మణిసాయితేజరేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం మెకానిక్‌. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్‌, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్‌ సహ నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్‌ అయింది. టి`సిరీస్‌ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆయన బిజీ షెడ్యూల్‌ కారణంగా చిత్ర యూనిట్‌ను తన ఇంటికి పిలిపించుకుని ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమానికి నిర్మాత, నటులు డి.యస్‌.రావ్‌, శ్రీకాకుళం షెర్లాక్ హోo దర్శకుడు మోహన్‌ ముఖ్య అతిథిలు గా హాజరయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వీడియో బైట్‌ ద్వారా తన సందేశాన్ని ఇచ్చారు.

ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ…
నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతం ఎంతోమంది జీవితాలు ఈ ఫ్లోరైడ్‌ నీటి వల్ల నాశనం అయ్యాయి. రాబోయె రెండు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాను పూర్తిగా ఫ్లోరైడ్‌ రహిత ప్రాతంగా చేస్తాము. ఈ ఫ్లోరైడ్‌ సమస్యను ప్రధానంగా తీసుకుని, సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన మెకానిక్‌ వంటి సినిమాలను ప్రజలందరూ ఆదరించాలి. దీని ద్వారా సమాజానికి ఈ సమస్య, బాధితుల బాధలు అర్ధమౌతాయి.అందరు థియేటర్ కెల్లి ఈ సినిమాని చూడవల్సిందిగా కోరారు. ఈ చిత్రం తప్పకుండా మoచి విజయం సాధిస్తుంది అన్నారు.

డి.యస్‌. రావు మాట్లాడుతూ…
సినిమా ట్రైలర్‌, పాటలు చాలా బాగున్నాయి. ఒక చిన్ని సినిమా పాటలు టి`సీరీస్‌ వారు తీసుకోవడంతోనే పెద్ద విజయం సాధించారు. దర్శక, నిర్మాతలు…అలాగే మంచి మెసేజ్‌కూడా ఉండటం ఈ సినిమా విజయానికి హెల్ప్‌ అవుతుంది. మెకానిక్‌ చాలా పెద్ద హిట్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్‌ అందరికీ అభినందనలు చెపుతున్నా అనారు.

శ్రీకాకుళం షెర్లాక్స్‌ దర్శకుడు మోహన్‌ మాట్లాడుతూ…
మంచి ప్యాషన్‌ ఉన్న దర్శక, నిర్మాతలు రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే ఆడియో పరంగా సూపర్‌హిట్‌ అయింది. సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అన్నారు.

నిర్మాత మున్నా మాట్లాడుతూ…
మా సినిమా ఆడియో మా అంచనాలను దాటి పెద్ద హిట్టు
అయింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో అన్ని కమర్షియల్‌ అంశాలూ ఉన్నాయి. మా సహ నిర్మాతలు నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండరాశి ఉపేందర్‌ల సహకారం వల్లనే మంచి సినిమా నిర్మించగలిగాను. వారికి నా థ్యాంక్స్‌. దర్శకుడు ముని సహేకర మల్టీ టాలెంటెడ్‌. మంచి పర్‌ఫెక్షన్‌, విజన్‌ ఉన్న దర్శకుడు, రచయిత. బ్లాక్‌బస్టర్‌ సంగీతం ఇచ్చిన సంగీత దర్శకుడు వినోద్‌ యాజమాన్య గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు ముని సహేకర మాట్లాడుతూ…
మంచి చిత్రం రావాలంటే మంచి నిర్మాత దొరకాలి. నాకు మంచి నిర్మాతలే కాదు.. గట్స్‌ ఉన్న నిర్మాతలు దొరికారు. దేనికి ఎంత అవుతోంది అని ఆలోచించకుండా ఖర్చుపెట్టారు. వినోద్‌ యాజమాన్యగారు పాటల విషయంలో తన స్వంత సినిమా అన్నట్టుగా ప్రాణం పెట్టి పనిచేశారు. తన రెమ్యునరేషన్‌ గురించి ఆలోచించకుండా మంచి పాటలు రావటానికి మాచేత ఖర్చు పెట్టించారు. ఇందుకు ఉదాహరణ సిద్‌శ్రీరాం గారు మా సినిమాలో ఓ పాట పాడటం ఆనందంగా ఉంది. హీరో, హీరోయిన్‌లు కూడా చక్కగా సూటయ్యారు. మంచి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా. తనికెళ్ల భరణిగారు అందించిన సహకారం మరువలేనిది. ఆడియో లాగే సినిమా కూడా సూపర్‌ సక్సెస్‌ అయి, మా అందరికీ మంచి కెరీర్‌ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.

కో ప్రొడ్యూసర్‌లో ఒకరైన నంది పాటి శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ..
కథ బాగా నచ్చడం వల్ల ఎక్సైట్‌ అయ్యి సహ నిర్మాతగా జాయిన్‌ అయ్యా. చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ లేవు.. హిట్‌ సినిమా, ఫ్లాప్‌ సినిమా అంతే. మా సినిమా ఖచ్చితంగా హిట్‌ సినిమా అవుతుంది అన్నారు.

కో`ప్రొడ్యూసర్స్‌లో మరొకరైన కొండ్రాసి ఉపేందర్‌ మాట్లాడుతూ…
దర్శకుడు అద్భుతమైన మెసేజ్‌తో కథ రాసుకున్నారు. మా అబ్బాయి మణిసాయి తేజను ఈ చిత్రానికి హీరోగా తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాత మున్నాగారు, దర్శకుడు ముని సహేకర్‌ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని చెప్పాలి. మెకానిక్‌ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటాడు. విడుదలకు ముందే ఆడియో పెద్ద హిట్‌ అయ్యి మాకు సక్సెస్‌ను రుచి చూపించింది. ఫిబ్రవరి 2న ఖచ్చితంగా ఇక్కడే సక్సెస్‌మీట్‌ను నిర్వహిస్తాం అన్నారు.

హీరో మణి సాయితేజ, హీరోయిన్‌ రేఖ నిరోషాలు మాట్లాడుతూ.. తమను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత మున్నా గారికి, దర్శకుడు ముని సహేకర్‌ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. మా సినిమా ఆడియో ఇంత సూపర్‌ సక్సెస్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా ఇలాగే సూపర్‌ సక్సెస్‌ అవుతుంది. దర్శకుడు ముని గారి టాలెంట్‌కు హేట్సాఫ్‌. ఆయన చెప్పినదానికన్నా బాగా తెరకెక్కించారు. యూనిట్‌ అందరికీ మా థ్యాంక్స్‌ అన్నారు.

నటీనటులు :

తనకెళ్ల భరణి, నాగ మహేష్‌, సూర్య, చత్రపతి శేఖర్‌, సమ్మెట గాంధీ, కిరీటి, జబర్ధస్త్‌ దొరబాబు, జబర్ధస్త్‌ పణి, సంద్య జనక్‌, సునీత మనోహర్‌, మాస్టర్ చక్రి

సాంకేతిక వర్గం :

సంగీతం: వినోద్‌ యాజమాన్య
డీఓపీ: ఎస్‌.పి. శివరాం
ఎడిటర్‌: శివ శర్వాణి
నిర్మాత: ఎం. నాగ మునెయ్య (మున్నా)
దర్శకత్వం: ముని సహేకర