‘మెట్రో క‌థ‌లు’ ఫ‌స్ట్ గ్లింప్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన హారీశ్ శంక‌ర్‌…

మెట్రో క‌థ‌లు’ ఫ‌స్ట్ గ్లింప్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన హారీశ్ శంక‌ర్‌… ఆగ‌స్ట్ 14న ‘ఆహా’లో ప్ర‌సారం
ప్ర‌స్తుత వినోద మాధ్యమాల్లో డిజిట‌ల్ మాధ్య‌మం కీల‌కంగా మారింది. వినోదానికి పెద్ద పీట వేసే తెలుగు ప్రేక్ష‌కులను డిఫ‌రెంట్ కంటెంట్‌ల‌తో ‘ఆహా’ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆక‌ట్టు కుంటూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా ఒక వైపు ‘సిన్, లాక్‌డ్, మస్తీస్, గీతా సుబ్రమణ్యం’ వంటి వెబ్ సిరీస్‌లు, మరో వైపు ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలు అందించి ‘ఆహా’ అనిపించుకుంటోంది.
తెలుగు ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఎంగేజ్ చేస్తున్న ఆహా ఇప్పుడు మ‌రో ఎగ్జ‌యిటింగ్ ఒరిజిన‌ల్ ‘మెట్రో క‌థ‌లు’తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి రెడీ అయ్యింది. ‘ప‌లాస 1978’ చిత్రంతో ఘ‌న విజ‌యం సాధించిన డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ ‘మెట్రో క‌థ‌లు’ను తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు రచయిత కదిర్ బాబు రచించిన ‘మెట్రో కథలు’ పుస్తకంలోని నాలుగు కథలను ఆధారంగా చేసుకుని హైద‌రాబాద్ న‌గ‌రంలో నాలుగు జంట‌ల మ‌ధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాల స‌మాహారం(అంథాలజీ)గా ఈ ‘మెట్రో క‌థ‌లు’ ఒరిజినల్ రూపొందింది.  స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 14న ఈ ఒరిజిన‌ల్ ‘ఆహా’లో ప్రసారం కానుంది. ఈ అంథాల‌జీ ఫ‌స్ట్ గ్లింప్స్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు.
అలీ రాజా, స‌నా, నందినీ రాయ్‌, రామ్ మ‌ద్దుకూరి, తిరువీర్‌, న‌క్ష‌త్ర‌,  రాజీవ్ క‌న‌కాల‌, గాయత్రి భార్గ‌వి త‌దిత‌రులు న‌టించిన ఈ అంథాల‌జీకి సినిమాటోగ్ర‌ఫీ:  వెంక‌ట ప్ర‌సాద్‌, సంగీతం: అజ‌య్ అర్సాడ‌, ఎడిట‌ర్‌: శ‌్రీనివాస్ వ‌ర‌గంటి, నిర్మాత‌లు:  కిర‌ణ్ రెడ్డి మందాడి, రామ్ మ‌ద్దుకూరి, క‌థ‌:  మహ్మ‌ద్ క‌దిర్ బాబు, అడిష‌న‌ల్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  క‌రుణ కుమార్‌.