మేజర్‌ చిత్రం థియేట్రికల్‌ రిలీజ్‌ వాయిదా

Published On: May 26, 2021   |   Posted By:
మేజర్‌ చిత్రం థియేట్రికల్‌ రిలీజ్‌ వాయిదా
 
వెర్స‌టైల్ హీరో అడివి శేష్‌ ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయ‌న బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న‌ ప్యాన్‌ ఇండియా మూవీ ‘మేజర్‌’. గూఢ‌చారి ఫేమ్ శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న ‘మేజర్‌’ చిత్రంలో ఎన్‌ఎస్‌జీ(నేషనల్‌ సెక్యూరిటీ గార్డు) కమాండో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో కనిపించనున్నారు అడివి శేష్‌.

తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో మేజర్‌ చిత్రాన్ని ఈ ఏడాది జూన్‌ 2న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్రయూనిట్‌ ప్రకటించారు. కానీ ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ‘మేజర్‌’ సినిమా థియేట్రిక‌ల్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

‘‘కోవిడ్‌ సేకండ్‌ వేవ్‌ కారణంగా దేశవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. కోవిడ్‌ నియమ నిబంధలను పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉంటున్నారని మేం అనుకుంటున్నాం. అలాగే జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాం. మా ‘మేజర్‌’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 2న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘మేజర్‌’ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ‘మేజర్‌’ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం. దయచేసి విధిగా మాస్కులు ధరించండి. కోవిడ్‌ నియమనిబంధనలను, నియంత్రణ చర్యలను తప్పక పాటించండి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

ముంబై 26/11 ఉగ్రవాద దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించిన అమర వీర జవాను, ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ‘మేజర్‌’ చిత్రం రూపొందుతోంది.

అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న ఈ‘మేజర్‌’ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  ప్రకాష్‌రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ ఫ్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంస్థల అసోసియేషన్‌తో సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తుంది.

తారాగాణం: అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్, రేవతి, మురళీ శర్మ

సాంకేతిక నిపుణులు
దర్శకుడు: శశికిరణ్‌ తిక్క
నిర్మాణం: మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ ఫ్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా
స్టోరీ అండ్‌ స్క్రీన్‌ ప్లే: అడివి శేష్‌
స్క్రిప్ట్‌ గైడెన్స్, తెలుగు డైలాగ్స్‌: అబ్బూరి రవి
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్‌: శ్రీచరణ్‌ పాకాల
ఎడిటింగ్‌: ఎస్‌ వినయ్‌కుమార్, కె.పవన్‌కల్యాణ్‌
లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి (తెలుగు), రితేష్‌ రజ్వాడ (హిందీ)
ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్ల
యాక్షన్‌ కొరియోగ్రఫీ: సునీల్‌ రోడ్రిగజ్‌
అడిషినల్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ: నభ, సుబ్బు
హిందీ డైలాగ్స్‌: అక్షత్‌ అజయ్‌ శర్మ
మలయాళం డైలాగ్స్‌: ఏదు, అభిజిత్‌. ఎమ్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: బి. రేఖ