మైఖేల్ మూవీ రివ్యూ

Published On: February 3, 2023   |   Posted By:

మైఖేల్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియా చిత్రం మైఖేల్. టీజర్, ట్రైలర్ విడుదలై మూవీపై అంచనాలను ప్రేక్షకుల్లో భారీగా పెంచేశాయి. రంజిత్ జ‌య‌కోడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రపచం వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ్ భాషల్లో మాత్రమే కాక హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రం ఎంతో వైవిధ్యంగా, సరికొత్తగా ఉంటుందని చెప్పబడుతున్న ఈ చిత్రం ఎలా ఉంది . ఈ సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుంది .అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ 

మైఖేల్ (సందీప్ కిషన్) అనే కుర్రాడు చిన్నప్పుడే గురు అలియాస్ గురునాథ్ (గౌతమ్ మీనన్) అనే గ్యాంగస్టర్ దగ్గర పెరుగుతాడు. అతన్ని రెండు సార్లు రక్షించటంతో అతని నమ్మకం పూర్తిగా సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో మైఖేల్ కు జీవితంలో కేవలం ఒకే ఒక్క లక్ష్యం ఉంటుంది. ఈ లోగా తనని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వ్యక్తుల్లో రతన్‌ (అనీష్‌ కురువిల్లా)ను తప్ప మిగతా అందర్నీ చంపిన గురునాథ్‌ ఆ మిగిలిన ఒక్కడ్ని, అతడి కూతురు తీర (దివ్యాంశ కౌశిక్‌)ను చంపే బాధ్యతను మైఖేల్‌ అప్పచెప్తాడు. రతన్‌ను పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన మైఖేల్ తీర ప్రేమలో పడతాడు. ఆ తర్వాత రతన్‌ దొరికినా చంపకుండా వదిలేస్తాడు. ఆ టైమ్ లో గురునాథ్‌ కొడుకు అమర్‌నాథ్‌ (వరుణ్‌ సందేశ్‌) గురించి ఓ విషయం పంచుకుంటాడు. ఇంతకీ అదేంటి?ఇంతకీ మైఖేల్ లక్ష్యం ఏంటి? ఎవరికీ తెలియకుండా అసలు మైఖేల్ దాస్తున్న తన గతం ఏంటి? మైఖేల్ తన లక్ష్యాన్ని సాధించగలిగాడా? ఈ విషయంలో ఎవరు తనకి సహాయం చేశారు? ఎవరి వల్ల అడ్డంకులు ఎదుర్కొన్నాడు? చివరికి ఏమైంది? రతన్‌ను చంపకుండా వదిలేసిన మైఖేల్‌ను గురునాథ్‌ ఏం చేశాడు? మైఖేల్ కథకు గురునాథ్‌  అతని భార్య చారులత (అనసూయ)కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ల పాత్రలేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎనాలసిస్

ఈ సినిమా స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నేరేషన్, మేకింగ్ అంతా సరికొత్తగా అనిపిస్తుంది. విజువల్‌గా ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. డ్రామా, యాక్షన్ ఎంతో సరికొత్తగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు వాస్తవికతకు దగ్గరకు ఉంటాయి. మైఖేల్ పాత్ర చాలా వైల్డ్‌గా ఉంటాడు. అంతేకాకుండా చాలా వరకు ప్రశాంతంగా కనిపిస్తాడు. కోపమోస్తే మాత్రం భయంకరంగా కనిపిస్తాడు. స్నేహితులు ఉండరు. ఎవ్వరితోనూ మాట్లాడడు. అంటూ సందీప్ కిషన్ మైఖేల్ సినిమాలో తన పాత్ర గురించి చాలా చెప్పారు. అయితే సినిమా అంత సీన్ మాత్రం ఉండదు. స్క్రిప్టు సమస్యగా కనపడుతుంది. రొటీన్ సీన్స్ ను కూడా మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా సినిమాని బాగానే తెరకెక్కించారు డైరెక్టర్. కానీ సినిమా కథ చాలా వీక్ గా ఉండటం సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. ఈ చిత్రం కథ, కథనాలు కొత్తగా అనిపించవు. కథను చెప్పిన తీరు కెజిఎఫ్ను గుర్తు చేస్తుంది. అయితే . కథ ముందుకు వెళుతున్న కొలదీ కథకు కనెక్ట్ అవుతూ ఉంటాం. అయితే మేకింగ్ తో లాగుదామని ప్రయత్నించారు. కానీ ట్రీట్మెంట్ అడ్డుపడింది. రెట్రో స్టైల్‌లో బాగా తీశారు. యాక్షన్ సినిమా ప్రేమికులకు ఆ స్టైల్ బాగా నచ్చే అవకాసం ఉంది.

నటీనటుల్లో

వాస్తవానికి సందీప్ కిషన్ కు సరైన హిట్ వెంకటాద్రి ఎక్సప్రెస్ తర్వతా పడలేదు. అయినా అతని ప్రయాణం ఎక్కడా బ్రేక్ పడలేదు అయితే ఈ సినిమాలో బాగా కష్టపడలేదు. సిక్స్ ప్యాక్ చేసి త‌న లుక్ మార్చుకున్న సందీప్‌  యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ క‌ష్ట‌ప‌డ్డాడు. త‌న యాక్టింగ్ కూడా డిఫ‌రెంట్ మూడ్‌లో ఉండ‌టాన్ని గ‌మ‌నించ‌వచ్చు. ఇక సినిమాలో విల‌న్‌గా చేసిన గౌత‌మ్ మీన‌న్‌  పేరు మోసిన డాన్ పాత్ర‌ల్లో మెప్పించాడు. ఇక దివ్యాంశ కౌశిక్‌ మ‌జిలీ త‌ర్వాత మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. మెప్పించింది.ఇన్‌టెన్స్ ల‌వ్ సీన్స్‌లో చ‌క్క‌గా యాక్ట్ చేసింది. అన‌సూయ పాత్ర ప‌రిమితంగా ఉండటం కలిసొచ్చింది పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించింది వ‌రుణ్ సందేశ్ ఇది వ‌ర‌కు చేసిన పాత్ర‌కు భిన్న‌మైన నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. అలాగే విజ‌య్ సేతుప‌తి, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ రోల్స్ ఫ్యాన్స్‌కి న‌చ్చుతాయి.

టెక్నికల్ గా

దర్శకుడు రంజిత్ జ‌య‌కోడి కథ పరంగా సరిగ్గా చేయలేకపోయాడు. రివేంజ్ ఫార్ములా క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. సినిమాలో హీరో క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసిన తీరు, దానికి అనుగుణంగా రాసిన డైలాగ్స్‌  స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన విధానం చూస్తుంటే త‌నొక కె.జి.య‌ఫ్ త‌ర‌హా సినిమా చేయాల‌నుకున్నార‌నేది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. విజువ‌ల్స్ ప‌రంగా, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించే సంద‌ర్భంలోనూ ద‌ర్శ‌కుడు హ్యండిల్ చేసిన ప‌ద్ధ‌తి ఆక‌ట్టుకుంటుంది. సామ్ సి.ఎస్ సంగీతం, నేప‌థ్య సంగీతం బాగానే ఉన్నాయి. కిర‌ణ్ కౌశిక్ విజువ‌ల్స్ కూడా డిఫ‌రెంట్ టింట్‌తో ఆక‌ట్టుకుంటాయి.

చూడచ్చా

కేవలం సందీప్ కిషన్ వీరాభిమానులకు మాత్రమే నచ్చుతుంది

నటీనటులు :

సందీప్‌ కిషన్‌, దివ్యాంశ కౌశిక్‌, విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, అనసూయ, వరుణ్‌ సందేశ్‌, అయ్యప్ప పి.శర్మ, అనీష్‌ కురవిల్లా.

సాంకేతికవర్గం :

సంగీతం: సామ్‌ సిఎస్‌;
ఛాయాగ్రహణం: కిరణ్‌ కౌశిక్‌;
నిర్మాతలు: భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు;
దర్శకత్వం: రంజిత్‌ జయకోడి;
రన్ టైమ్ : 123 మినిట్స్
విడుదల తేదీ: 03-02-2023