మొక్కలు నాటిన నిర్మాత బండ్ల గణేష్
 
గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర్ లో మొక్కలు నాటిన నిర్మాత బండ్ల గణేష్
 
ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది అక్షిజన్ అలాంటి దానిని ఏ స్వార్థం లేకుండా మనకు అందించేది వృక్షాలు దీనిని ఒక కొత్త రకంగా ఆలోచించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నిర్మాత బండ్ల గణేష్ పిలుపునిచ్చారు. టి.వి 5 మూర్తి గారు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర్ లో కూతురు జనని బండ్ల తో కలిసి మూడు మొక్కలు నాటిన నిర్మాత బండ్ల గణేష్….
 
అనంతరం తాను మరో ముగ్గురు ( డైరెక్టర్లు కృష్ణ వంశీ , పరుశరాం , శ్రీను వైట్ల ) లకు ఛాలెంజ్ విసురుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పలుపంచుకుంటునందుకు చాలా గర్వంగా ఉందని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.