మొక్కలు నాటిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు
 
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత  లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ విసిరిన చాలెంజ్ స్వీకరించి మణికొండ లోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటిన నటుడు ,యాంకర్ ప్రదీప్ మాచిరాజు.
 
ఎంపీ సంతోష్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుందని నేను కూడా భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని ప్రదీప్ అన్నారు.బావి తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే అందరూ మొక్కలు నాటాలి అని అన్నారు.
 
అనంతరం కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్,నటి ప్రియమణి,హీరో రామ్ పోతినేని ముగ్గురికి చాలెంజ్ విసిరిన ప్రదీప్ మాచిరాజు.
 
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు..