మొక్కలు నాటిన హీరోయిన్ కీర్తి శెట్టి
 
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన (ఉప్పెన సినిమా) హీరోయిన్ కీర్తి శెట్టి
 
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉప్పెన సినిమా నిర్మాత మైత్రి రవి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు బొంబాయి లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఉప్పెన సినిమా హీరోయిన్ కీర్తి శెట్టి ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ లో తెలియజేయడం జరిగింది.
 
ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం బాధ్యత అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.