మొక్కలు నాటిన RX 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన RX 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి…..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మాదాపూర్ లోని కావూరి హిల్స్ పార్క్ లో మొక్కలు నాటిన RX 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి…ఈ సందర్భంగా  మాట్లాడుతూ రోజు రోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని మనము స్వేచ్ఛగా గాలి తీసుకొనే పరిస్థితి లేకుండా పోయిందని ఇలాంటి సమయంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక మంచి కార్యక్రమం చేపట్టి మా చేత మొక్కల నాటించడం చాలా మంచి కార్యక్రమం. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మరో ముగ్గురు ( ఎంపీ రఘురామ కృష్ణ రాజు , మజిలీ సినిమా డైరెక్టర్ శివ నిర్వనా , డైరెక్టర్ ప్రశాంత్ ) లకు ఛాలెంజ్ విసురితూ మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్  స్వీకరించాలని కోరుతున్నానని డైరెక్టర్ అజయ్ భూపతి తెలిపారు.