యక్షిణి వెబ్ సిరీస్ మంచు లక్ష్మి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ యక్షిణిలో జ్వాల క్యారెక్టర్ లో ఆకట్టుకోనున్న మంచు లక్ష్మి

ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిణి. ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు తేజ మార్ని యక్షిణి సిరీస్ ను రూపొందిస్తున్నారు.

ఈ రోజు మిస్టీరియస్ జ్వాల అంటూ స్పెషల్ పోస్టర్ ద్వారా యక్షిణి వెబ్ సిరీస్ నుంచి మంచు లక్ష్మి నటించిన జ్వాల క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాలతో రూపొందిన యక్షిణి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. డైరెక్టర్ తేజ మార్ని విజన్ కు తగినట్లు భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఆర్కా మీడియా వర్క్స్ ఈ సిరీస్ ను నిర్మించింది. జూన్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో యక్షిణి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.