యావరేజ్ స్టూడెంట్ నాని మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ఆకట్టుకునేలా యావరేజ్ స్టూడెంట్ నాని ఇంటెన్స్, బోల్డ్ ఫస్ట్ లుక్

మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. యావరేజ్ స్టూడెంట్ నాని అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ రోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుందో అర్థమవుతోంది. స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించారు.

ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్.

సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

తారాగణం:

పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు

సాంకేతిక సిబ్బంది :

రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరి
నిర్మాతలు: పవన్ కుమార్ కె, బిషాలి గోయెల్
సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల
DOP: సజీష్ రాజేంద్రన్
ఎడిటర్: ఉద్ధవ్ SB