రాజు యాదవ్‌ మూవీ మే 24 విడుదల

గెటప్‌ శ్రీను, కృష్ణమాచారి. కె, సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ రాజు యాదవ్‌ ను ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మే 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ రాజు యాదవ్ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో విడుదల చేయబోతున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ బ్యాకింగ్ తో రాజు యాదవ్ చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.

స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాజు యాదవ్.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో అలరించనుంది.

సాయిరామ్ ఉదయ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.

నటీనటులు :

గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు..

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: కృష్ణమాచారి. కె
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి
బ్యానర్లు: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
డీవోపీ: సాయిరామ్ ఉదయ్ D.F.Tech
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి