లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ మూవీ  రివ్యూ  

Published On: November 5, 2022   |   Posted By:

లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ మూవీ  రివ్యూ  

సంతోష్ శోభన్ ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ రివ్యూ  

Emotional Engagement Emoji
 👎

సంతోష్ శోభన్ ..ఓటిటి జనాలకు బాగా పరిచయం. థియేటర్ లో అతన్ని గుర్తు పట్టడం కష్టం. అదే విషయం అతనే చెప్పుకున్నాడు. అయితే ఇప్పుడు హీరోని చూసి

ఓపినింగ్స్ వరకూ వస్తాయేమో కానీ…కంటెంట్ బాగుంటేనే కరెంట్ స్దంబంలా నిలబడుతుంది. అప్పటికి ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’  సినిమాను ప్రమోట్ చేయడం కోసం

టీం చేయాల్సినవన్నీ చేశారు. అయినా అనుకున్న స్దాయిలో బజ్ క్రియేట్ కాలేదు. ఈ నేపధ్యంలో మౌత్ టాక్ నే నమ్ముకున్న ఈ సినిమా ఎలా ఉంది.. ఇన్నాళ్లూ ఓటీటీ

హీరో అనిపించుకున్న ఈ యంగ్ హీరో మరి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ సాదించాడా..సినిమా కథేంటో చూద్దాం.

స్టోరీ లైన్ :

ఓ గొప్ప యూ ట్యూబ్ విడియో బ్లాగర్ అవ్వాలనేది విప్లవ్ (సంతోష్) జీవితాశయం. ఎంత కష్టపడ్డా  సబ్ స్క్రైబర్స్ పెరగరు.అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న విక్రమ్ …కొత్త వీడియోలు కోసం అరుకు వెళ్తాడు. అక్కడ  అతనికి తాను ఎంతగానో అభిమానించే వసుధ వర్మ(ఫరియా అబ్దుల్లా) అనే మరో తెలుగు వ్లాగర్ కూడా పరిచయమవుతుంది. ఆమె మీద మనస్సు పడతాడు. తన  ప్రేమను వ్యక్తపరిచేలోపే ఆమె అతను ఆమె అంటే అసహ్యాన్ని బయట పెడుతుంది. ఇదిలా జరుగుతూంటే…అక్కడ వీళ్లకు కొందరు నక్షలైట్లు  ఎదురవుతారు.  ఇదిలా ఉంటే మరో ప్రక్క ఇంకో కథ రన్ అవుతుంది. నక్సలైట్లను శాంతి చర్చలకు పిలుస్తుంది గవర్నమెంట్. అలా వచ్చిన ముగ్గురు నక్సల్ నేతలు వెనక్కు వెళ్లే క్రమంలో మాయం అవుతారు. దీనికి డిజిపినే కారణం అతన్ని  హత్య చేసే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటిటంటే సదరు డిజిపి కూతురు వసుధ. అలాగే నక్సల్స్ కి ప్రభుత్వానికి మధ్య వారథిలా వుండే రాజు (బెనర్జీ) కొడుకే హీరో విప్లవ్. ఇటు విడియోల మేకింగ్ . అటు నక్సల్స్..పోలీసుల మధ్య వ్యవహారాలు. ఈ రెండింటితో ఈ కథ ఏ తీరం చేరింది అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఈ సినిమా  కలగూరగంపలా ఉందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన యూట్యూబ్ ట్రెండు ని బేస్ చేసుకుని ఈ కథ అల్లారు. ట్రావెల్ వ్లాగ్గింగ్ కెరీర్ గా ఎంచుకోవాలని భావించే ఒక కుర్రాడు అనూహ్యంగా అడవుల్లోకి వెళ్లి ఇబ్బందుల్లో పడడం, అతన్ని కాపాడడం కోసం అదే అడవికి వెళ్లిన వసుధ ప్రయత్నించడం ఆ తర్వాత వారికి నక్సలైట్లు ఎదురు పడటం అంతవరకూ బాగానే ఉంది.కానీ వాళ్లు ..అదే నక్సలైట్, డీజీపి పిల్లలు అని తెలిసాక డైజస్ట్ అవ్వదు. నక్సలైట్స్ వంటి ఓ సీరియస్ అంశాన్ని ఫన్ చేద్దామనే ప్రయత్నం కలిసి రాలేదు. నక్సల్ లీడర్ బ్రహ్మాజీ క్యారక్టర్ ని సైతం బఫూన్ లా ట్రీట్ చేసారు. ఫిల్మ్ క్రిటిక్ గా సప్తగిరి పాత్రను పరిచయం చేస్తారు. అదీ ఓ అర్దం ,పర్దం లేకుండా సాగుతుంది. ట్రైలర్స్, టీజర్స్ చూసాక..  సినిమా మొత్తం కూడా ఫన్ ఎంటర్టైనర్ అనుకుంటాం. కానీ డైరక్టర్ అలా కాకుండా కొన్ని సీరియస్ ఎలిమెంట్స్ కలపటంతో ఇబ్బంది ఎదురైంది. ఫస్టాఫ్ ఓకే..కాసేపు నవ్వుకున్నాం అనుకుంటాం. సెకండాఫ్ అయితే అదీ లేదు. నవ్వించే బాధ్యత అంతా సుదర్ళన్ తీసుకున్నాడు. హీరో వైపు నుంచి కామెడీ పేలలేదు. స్టోరీ, నేరేషన్ విషయంలో సీరియస్ ఎప్రోచ్ ఉంటే ఖచ్చితంగా బాగుండేది. అలా చేయకపోవటంతో ఓ clumsy ఎటెమ్ట్ గా మిగిలిపోయింది. ఏదైమైనా నక్సలైట్ నేపధ్యంలో వచ్చిన సినిమాలకు కాలం చెల్లిపోయింది అని మరోసారి ప్రూవ్ అయ్యింది.

టెక్నికల్ గా…

ఏ వసంత్ చేసిన సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్ బాగా కలిసి వచ్చాయి. పచ్చదనం అందాన్ని తీసుకొచ్చింది. ఇక  కథకు అడ్డం పడే సీన్లు అనేకం వదిలేసారు ఎడిటర్   రాము తూము.  కామెడీ బేస్ట్ యాక్షన్ సీన్లను బాగా తెరకెక్కించారు. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ జస్ట్ ఓకే అన్నట్లు సాగింది. కీ సీన్స్ లో  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరిగ్గా ఇవ్వలేకపోయారు. నిహారిక, అముక్త బ్యానర్ల నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికి వస్తే… హీరో సంతోష్ శోభన్ ..నిజానికి అన్ని ఈజ్ తో చేయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ కామెడీ సైతం అతని మీద ఫెయిల్ అయ్యింది .హీరోయిన్ లో పాత్రలో ఉషారు ఉన్నా..ఆమెలో చలాకీ తనం కనపడలేదు. ఎక్స్ ప్రెషెన్స్ పెద్దగా ఇచ్చింది లేదు.నవ్వుతూనే గడిపేసింది చిట్టి. ముఖ్యంగా ఆమె డబ్బింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. డీజీపీ పాత్రలో తమిళ నటుడు ఆకట్టుకున్నారు. మిగితా పాత్రల్లో సుదర్శన్ కెమెరామెన్‌గా తన మార్క్ కామెడీని పండించాడు. బాలీవుడ్‌లో పాపులర్ సినిమాలకు, అలాగే దంగల్ మూవీకి కెమెరా మెన్‌ అంటూ బిల్డప్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్‌గాను, ఫన్‌గాను ఉంది. సుదర్శన్, బ్రహ్మాజీ ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ఉన్నంతలో   బ్రహ్మాజీ డామినేట్ చేయడం కనిపిస్తుంది.

చూడచ్చా…

ఈ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్  సినిమాని అందరూ లైక్ చేస్తారని చెప్పలేం. కొంత మంది బోర్ ఫీలవుతారు.

బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్
తారాగణం: సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్‌, బ్రహ్మాజీ, దయానంద్‌ రెడ్డి, మైమ్‌ గోపీ, గోవింద్‌ పద్మసూర్య, సప్తగిరి తదితరులు;
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, రామ్‌ మిర్యాల;
ఛాయాగ్రహణం: ఎ.వసంత్‌;
కూర్పు: రామ్‌ తూము;
రన్ టైమ్:  2h 14m
రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ;
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్)
నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి;
విడుదల తేదీ: 04-11-2022