వాల్తేరు వీరయ్య నాల్గవ పాట విడుదల

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య నాల్గవ పాట పూనకాలు లోడింగ్ విడుదల

పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే, మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య లోని నాల్గవ పాటను చూడండి.

ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పూనకాలు లోడింగ్ పాట ని విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్‌లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ పాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ అనడం పూనకాలని రెట్టింపు చేసింది.

చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది. జాతర సెటప్, భారీ జనసమూహం ఈ మాస్ నంబర్‌ అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. చిరంజీవి, రవితేజల బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా ఉపయోగించాడు. చిరంజీవి మాస్‌ లుక్, గెటప్ ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు లాంటి బ్లాక్‌బస్టర్స్ ని గుర్తుకుతెస్తుంది. మరోవైపు రవితేజ ట్రెండీగా కనిపిస్తున్నారు. మెగామాస్ మ్యాజిక్‌ని బిగ్ స్క్రీన్‌లపై చూడాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.

బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు :

చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.

సాంకేతిక విభాగం:

కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి