విజయ్ దేవరకొండతో సినిమా అని తప్పుడు ప్రకటనలు

విజయ్ దేవరకొండ తో సినిమా తీస్తున్నామని ఆడిషన్స్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం – టీమ్ దేవరకొండ.
 
విజయ్ దేవరకొండతో కలిసి సినిమా తీస్తున్నట్లు కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుగా ప్రకటనలు ఇస్తూ నటి నటులకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు మా దృష్టి కి వచ్చింది.
 
విజయ్ దేవరకొండతో సంబంధం ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా అధికారికంగా విజయ్ మరియు అతని నిర్మాతలు ప్రకటిస్తారు.
 
విజయ్ పేరు చెప్పి మోసగిస్తున్న నేరస్తులపై మేము చర్యలు చేపట్టాము.
 
ఇలాంటి మోసగాళ్ళు పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి 
 
 మీకు వచ్చే సమాచారాన్ని రెండుసార్లు తనిఖీ చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము.
 
అని అనురాగ్ పర్వతనేని,విజయ్ దేవరకొండ టీమ్ ప్రకటన.