విశ్వ‌నాథ్ త‌న్నీరు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా

యమ్ 6 చిత్ర నిర్మాత విశ్వ‌నాథ్ త‌న్నీరు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా


విశ్వనాధ్ ఫిలిం  ఫ్యాక్టరీ  బ్యానర్ పై  గతం లో ” యమ్ 6″ చిత్రాన్నినిర్మించిన నిర్మాత  విశ్వనాధ్ తన్నీరు  పుట్టిన రోజు డిసెంబర్ 6. ఈ సందర్భం గా ఆయ‌న మాట్లాడుతూ తన తదుపరి చిత్ర విశేషాలను తెలియజేసారు. గతంలో ” యమ్ 6″ చిత్రాన్ని నిర్మించాను. ప్రస్తుతం నా దర్శకత్వంలో ఓ హార్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాను. ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఉంటుంది  ఈ చిత్రానికి సంభందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం పాటల రికార్డింగ్ చేస్తున్నాము. సింగర్ దీపు తో మొదటి పాట  రికార్డు చేసాం. ఇతర  వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.

 

ఈ సినిమాకి కథ, మాటలు: వేమగిరి, సంగీతం: విజయ్ కూరాకుల, పాటలు: మౌనశ్రీ మల్లిక్, కో- డైరెక్టర్స్: సూర్య ఆలంకొండ, శ్రవణ్ కుమార్ వీర్లపాటి , స్క్రీన్ ప్లే – నిర్మాత , దర్శకత్వం : విశ్వనాధ్ తన్నీరు