వీరభద్రం చౌదరి దర్శకత్వం లో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Published On: July 5, 2022   |   Posted By:

                                వీరభద్రం చౌదరి దర్శకత్వం లో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

వీరభద్రమ్ చౌదరి, నరేష్ అగస్త్య, డెక్కన్ డ్రీమ్ వర్క్స్ & జయదుర్గాదేవి మల్టీమీడియా చిత్రంలో హీరోయిన్ గా శ్వేత అవస్తి.

పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా,సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఇటివలే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్, జయదుర్గాదేవి మల్టీమీడియా బ్యానర్లపై నబిషేక్, తూము నర్సింహా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి సంబధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో మెరిసే మెరిసే ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా కనిపించనున్నారు. ఈ నెలలో ప్రారంభం కానున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ షూట్‌లో శ్వేత అవస్తి జాయిన్ కానున్నారు.

ఈ చిత్రం క్లోసం వీరభద్రమ్ చౌదరి డిఫరెంట్ కాన్సెప్ట్‌తోఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మరికొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సంబధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు నిర్మాతలు.

తారాగణం : నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి తదితరులు
టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వీరభద్రమ్ చౌదరి
నిర్మాతలు : నబీషేక్, తూము నర్సింహా పటేల్
బ్యానర్స్ : డెక్కన్ డ్రీమ్ వర్క్స్ & జయదుర్గాదేవి మల్టీమీడియా
సంగీతం : అనూప్ రూబెన్స్
పీఆర్వో : వంశీ- శేఖర్