శేఖర్ కమ్ముల పారిశ్యుధ్ద కార్మికులకు సాయం

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న పలువురికి తనవంతుగా సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయన జి.హెచ్.ఎం.సి,కర్నూలు పారిశ్యుధ్ద కార్మికులకు నెలరోజుల పాటు బాదం పాలు,మజ్జిగ అందచేస్తున్నారు.ఇప్పుడు హిజ్రాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు.అంతేగాకుండా వీళ్లకు సాయం చేయడానికి మరికొంత మంది ముందుకు రావాలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ లాక్డౌన్ time లో అత్యంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు Transgenders. వాళ్ళు పడుతున్న కష్టాలని ఊహించలేం కుడా.అన్నం లేక, ఉంటానికి ప్లేస్ దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు.ఇవి కాక సమాజంలో వాళ్ళ పట్ల ఉండే వివక్ష, అపోహలు వాళ్ళ ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్ళకి అడ్రస్ ఉండదు. ఓటర్ కార్డ్ ఉండదు. రేషన్ కార్డ్ ఉండదు. Health care పథకాలు వర్తించవు. సెన్సిటివ్ గా ఉందాం. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. 

ఎవరన్నా కాంటాక్ట్ చేయాలి అంటే

rachanamudraboyina@gmail.com’’

శేఖర్ కమ్ముల చేసిన సాయానికి కృతజ్ణతగా హిజ్రాలు ‘‘థాంక్యూ శేఖర్ కమ్ముల’’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు.మరింత మంది తమను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు.