శ్రీ‌కారం చిత్రంలో సాయికుమార్ లుక్ విడుద‌ల‌

సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘శ్రీ‌కారం’లో ఆయ‌న పాత్ర ‘ఏకాంబ‌రం’ లుక్ విడుద‌ల‌

యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీ‌కారం’ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ న‌టిస్తున్నారు.

సోమ‌వారం (జూలై 27) డైలాగ్ కింగ్ సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా, ఈ సినిమాలో ఆయ‌న లుక్‌తో కూడిన పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

సాయికుమార్ ఈ చిత్రంలో ఏకాంబ‌రం అనే కీల‌క పాత్ర చేస్తున్నారు. స‌న్న‌ని మీస‌క‌ట్టుతో యంగ్ లుక్‌లో ఆయ‌న‌ క‌నిపిస్తున్నారు.

శ‌ర్వానంద్ బ‌ర్త్‌డేకి రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, స్పెష‌ల్ టీజ‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీ ఆచంట నిర్మిస్తోన్న రెండో చిత్రం ‘శ్రీ‌కారం’.

‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’కు వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె. మేయ‌ర్ ‘శ్రీ‌కారం’ చిత్రానికీ చ‌క్క‌ని బాణీలు అందిస్తున్నారు. బుర్రా సాయిమాధ‌వ్ డైలాగ్స్ రాస్తుండ‌గా, జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
శ‌ర్వానంద్‌, ప్రియాంకా అరుళ్ మోహ‌న్‌, రావు ర‌మేష్‌, ఆమ‌ని, న‌రేష్‌, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ‌, స‌త్య‌, స‌ప్త‌గిరి.

సాంకేతిక బృందం:
డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
మ్యూజిక్‌:  మిక్కీ జె. మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ:  జె. యువ‌రాజ్‌
ఎడిటింగ్‌:  మార్తాండ్ కె. వెంక‌టేష్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్లా
పీఆర్వో:  వంశీ-శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: హ‌రీష్ క‌ట్టా
నిర్మాత‌లు:  రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌
ద‌ర్శ‌కుడు:  కిశోర్ బి.
బ్యాన‌ర్: 14 రీల్స్ ప్ల‌స్‌