శ్రీ-ల‌క్ష్మి చిత్రం ప్రకటన

యూత్ కంటెంట్ తో ఆక‌ట్టుకునే విజువ‌ల్స్ తో యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కిన చిత్రం బాయ్స్. ఈ చిత్రం శ్రీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం 1 గా విడుద‌ల కి సిధ్ధంగా వుంది. అయితే కొత్త ద‌ర్శ‌కుడు శ‌శి హ‌స్ చెప్పిన హ‌ర్ర‌ర్ కామెడి లో కాన్సెప్ట్ బాగా న‌చ్చిన నిర్మాత మిత్ర శ‌ర్మ ఇదే బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం 2 గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ-ల‌క్ష్మి అనే టైటిల్ ఖారారు చేశారు. దీనికి ది గొస్ట్ హంట‌ర్ అనే ట్యాగ్ లైన్ ని ఖ‌రారు చేశారు. నిర్మాత మిత్ర శ‌ర్మ త‌న మోద‌టి చిత్రం కూడా కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థాంశం న‌చ్చి త‌న‌ని ఎంక‌రేజ్ చేసి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌డు కూడా కొత్త వారిని ఎంక‌రేజ్ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌థ, క‌థ‌నం ఆక‌ట్ట‌కుంటే ఎలాంటి చిత్రానికైనా బాక్సాఫీస్ వ‌ద్ద ప్రేక్ష‌కులు, సినిఅభిమానుల‌ ప‌ట్టాభిషేకం క‌డుతున్నారు. మంచి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ్యాల‌నే లక్ష్యం తో స్టాపించిన‌ శ్రీ పిక్చర్స్ బ్యానర్  అని మిత్ర శ‌ర్మ తెలిపారు. ఈ చిత్రాన్ని ఈ ప్యాండ‌మిక్ సిట్యూవేష‌న్ త‌రువాత సెట్స్ మీద‌కి తీసుకు వెళతారు.
 
టెక్నికల్ టీమ్: 
 
రచన, దర్శకత్వం: శ‌శి హ‌స్‌
బ్యానర్: శ్రీ పిక్చర్స్
నిర్మాత: మిత్రా శర్మ
సహ నిర్మాత: పడవల బాలచంద్ర
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
డిఓపి : వెంకట్ ప్రసాద్
మ్యూజిక్ : స్మరన్