సందీప్ కిష‌న్ చిత్రం ప్ర‌క‌టన

సందీప్ కిష‌న్ హీరోగా రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ చిత్రం

యంగ్ హీరో సందీప్ కిష‌న్ గురువారం (మే 7) పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. 

ప్ర‌ముఖ నిర్మాత జెమిని కిర‌ణ్ త‌న ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 15గా సందీప్ కిష‌న్‌తో ఒక చిత్రాన్ని ప్ర‌క‌టించారు. సందీప్ కిష‌న్‌తో ఈ బ్యాన‌ర్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇదివ‌ర‌కు ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్’‌, ‘బీరువా’ వంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. 

ఈ చిత్రానికి రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. భాను బోగ‌వ‌ర‌పు క‌థ అందిస్తున్న ఈ చిత్రం అంద‌మైన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుంది.

ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా నిర్మాణ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఈ చిత్రం పూర్త‌యిన వెంట‌నే ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ నిర్మించే చిత్రంలో ఆయ‌న న‌టించ‌నున్నారు.

సాంకేతిక బృందం:
క‌థ‌:  భాను బోగ‌వ‌ర‌పు
ద‌ర్శ‌కుడు:  రామ్ అబ్బ‌రాజు
నిర్మాత‌:  పి. కిర‌ణ్‌
బ్యాన‌ర్‌:  ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌