సత్యసుమన్ బాబు హీరోగా అధికారి చిత్రం
 
పవర్ ఫుల్ కథాంశంతో వస్తోన్న‘అధికారి’
 
ఒక  ప్రభుత్వ అధికారి సమర్థవంతంగా పనిచేస్తే చాలా సమస్యలు తీరిపోతాయి. కానీ వారికి అడుగడునా రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదరవుంటాయి. మరికొందరు స్వతహాగానే అవినీతపరులై ఉంటారు. కానీ ప్రజలకు మేలు చేయాలనుకునే ఓ నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కొన్నాడు. వారిని ఎదురించి ప్రజలకు ఎంత గొప్పగా సర్వీస్ చేశాడు అనే కథాంశంతో వస్తోన్న సినిమా ‘ఐఏఎస్ అధికారి’(వర్కింగ్ టైటిల్). నేటి సమకాలీన రాజకీయాలపై సెటైరికల్ గానూ రూపొందబోతోన్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిపోయింది. అత్యంత పవర్ ఫుల్ కథాంశంతో రాబోతోన్న ఈ కథ అద్భుతంగా వచ్చిందనని చెబుతున్నాడు హీరో సత్యసుమన్ బాబు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ  లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. పరిశ్రమలోని ప్రతిభావంతమైన సీనియర్ ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించబోతున్నారు. 
 
 
శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందబోతోన్న ఈ చిత్రానికి స్వీయదర్శకత్వంలో సిహెచ్. సత్యసుమన్ బాబు రూపొందిస్తూ హీరోగా నటిస్తున్నాడు. ఆయన సరసన ఓ నోటెడ్ హీరోయిన్ నటించబోతోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోన్న ఈ చిత్రానికి కథ, మాటలు బాలకిశోర్. ఇక ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే తెలియజేయబోతున్నారు.