సప్త సాగరాలు దాటి సైడ్ బి నవంబర్ 17 విడుదల

Published On: November 6, 2023   |   Posted By:

సప్త సాగరాలు దాటి సైడ్ బి నవంబర్ 17 విడుదల

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు సగర్వంగా అందిస్తున్న సప్త సాగరాలు దాటి సైడ్ బి కోసం సమంత

ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన సప్త సాగరాలు దాటి సైడ్ ఎ విశేష ఆదరణ పొందింది. దీంతో సప్త సాగరాలు దాటి సైడ్ బి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

నవంబర్ 4న సాయంత్రం 06:06 గంటలకు అగ్ర కథానాయిక సమంత ఈ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్, దానిలోని ఆసక్తికరమైన మరియు ప్రత్యేక లక్షణాల కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల మేకర్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. నవంబర్ 17 నుండి థియేటర్‌లలో ప్రేక్షకులు ఈ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఆస్వాదిస్తారని విశ్వసిస్తున్నారు.

తెలుగులో సైడ్ ఎ ఘనవిజయం సాధించినట్లుగానే, సైడ్ బి కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ప్రతిభావంతుడైన హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ మరియు చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి తన కెమెరా పనితనంతో కట్టి పడేయగా, చరణ్ రాజ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు.

ట్రైలర్ లాంచ్ ఈ ఆకర్షణీయమైన ప్రయాణంలో ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ అద్భుతమైన సినిమా ప్రయాణాన్ని తెలుగు ప్రేక్షకులతో పంచుకోవడానికి చిత్ర బృందం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

నవంబర్ 17న సప్త సాగరాలు దాటి సైడ్ బి ఘనంగా విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

నటీనటులు:

రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్

సాంకేతికవర్గం :

రచన– దర్శకత్వం : హేమంత్ ఎం రావు
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్